కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబయి ఇండియన్స్‌పై సునాయాస విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉంది. పాయింట్ల పట్టికలోనూ ముంబయిని కిందికి నెట్టి నాలుగోస్థానానికి చేరింది. ఈ జోష్‌కు బ్రేక్ పడేలా వారికి భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసిన కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మోర్గాన్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. మోర్గాన్ రెండోసారి ఈ తప్పు చేసినందుకు ఈసారి రూ.24 లక్షలు జరిమానా విధించారు. తుది జట్టులోని ఆటగాళ్లకు గరిష్ఠంగా రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం వరకు కోత పడుతుంది.
స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేయడం మోర్గాన్‌కి ఇది మొదటిసారి ఏం కాదు. ఈ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్ 21న వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో.. ఇదే తరహాలో స్లో ఓవర్ రేటు మెయిన్‌టైన్ చేశాడు. అందుకు గానూ అప్పుడు కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది రెండోసారి కావడంతో మోర్గాన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. ఒక మ్యాచ్‌లో ఎంత సమయంలో బౌలింగ్ చేయాలి. పూర్తి ఓవర్లు ఇంత సమయంలో పూర్తి చేయాలని ముందుగానే క్షుణ్ణంగా నియమాలు రూపొందించారు. ఆ నిబంధనల దృష్ట్యా మరో మ్యాచ్‌లో మోర్గాన్ స్లో ఓవర్ రేట్ గనుక మెయిన్‌టైన్ చేస్తే ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా, ముంబయిపై కేకేఆర్ టీమ్ చాలా సునాయాసంగా గెలిచింది. 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసిన ముంబయి టీమ్ కేకేఆర్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేసింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి కోల్‌కతా 16 ఓవర్లలోపే మ్యాచ్ ముగించేసింది. ఓవర్‌నైట్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ, రాహుల్ త్రిపాఠి 74 పరుగులతో అద్భుతంగా రాణించారు.