క్రికెట్ లో రికార్డుల రారాజు అంటే విరాట్ కోహ్లీనే. టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వచ్చి వెళ్లుండొచ్చు కానీ కోహ్లీ లాంటి వాడు మళ్లీ రాడు, రాలేడు. ఎందుకంటే సచిన్ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థాయి బ్యాటర్ ఎవరా అని చూస్తున్న టైంలో కోహ్లీ వెలుగులోకి వచ్చాడు. జట్టులోకి కుదురుకోవడానికి కాస్త టైం తీసుకున్నాడు గానీ వన్స్ సెటిలైపోయిన తర్వాత తన బ్యాట్ పవర్ ఏంటనేది చూపించాడు. వన్ డౌన్ బ్యాటర్ గా ఎన్నో సరికొత్త రికార్డులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. అలాంటి కోహ్లీ ఇప్పుడు మరో అరుదైన వరల్డ్ రికార్డుకు జస్ట్ అడుగుదూరంలో ఉన్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ సాధారణ క్రికెటర్ గా కెరీర్ ప్రారంభించిన కోహ్లీ, టీమిండియా తరఫున ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్ గా పేరు సంపాదించాడు. కెప్టెన్ గానూ పలు విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం సారథిగా లేనప్పటికీ.. జట్టులో కొనసాగుతున్నాడు. 2019 తర్వాత దాదాపు మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. అందరితో చాలా మాటలుపడ్డాడు. చివరకు అభిమానుల నుంచి కూడా అసంతృప్తిని ఫేస్ చేశాడు. గతేడాది ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ లో సెంచరీలు కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. తన పని ఇంకా అయిపోలేదని ప్రూవ్ చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో అదరగొట్టేందుకు ప్లాన్ వేసుకుంటున్నాడు.
ఫిబ్రవరి 9 నుంచి నాగ్ పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లు కూడా ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈ మ్యాచులో గనక కోహ్లీ 64 పరుగులు చేస్తే మాత్రం ఎవరికీ సాధ్యం కానీ వరల్డ్ రికార్డు అతడి సొంతమవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ లో 25000 పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన క్రికెటర్ గా ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం 546 ఇన్నింగ్స్ ల్లో 24,936 పరుగులతో ఉన్నాడు. ఇక కోహ్లీ కాకుండా 25 వేల రన్స్ చేసిన ఆటగాళ్లలో సచిన్ (782 ఇన్నింగ్స్ ల్లో 34357 పరుగులు) టాప్ లో ఉన్నాడు. సంగక్కర (666 ఇన్నింగ్స్ లో 28016 పరుగులు), పాంటింగ్ (688 ఇన్నింగ్స్ లో 27483 రన్స్), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్ ల్లో 25957 పరుగులు), జాక్వెస్ కల్లీస్ (617 ఇన్నింగ్స్ ల్లో 25534 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరి కోహ్లీ వరల్డ్ రికార్డుకు చేరువలో ఉండటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Virat Kohli just 64 runs away to becomes fastest player in history to have completes 25000 runs in international cricket.
— CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023