ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలనే నానుడిని ఒంటపట్టించుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ తో రెండో వన్డేలో తన ప్రవర్తనతో కట్టిపడేశాడు.
మైదానంలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి బయటకు వచ్చేంత వరకు ఒకే ఎనర్జీ మెయింటేన్ చేస్తూ.. సహచరులను ప్రోత్సహిస్తూ.. ప్రత్యర్థులను ఉసిగొలుపుతూ సందడి చేసే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. వెస్టిండీస్ తో రెండో వన్డే నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు.. కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా.. డగౌట్ లో ఖాళీ గా కూర్చున్న కింగ్.. డ్రింక్స్ బాయ్ అవతారమెత్తాడు. రిజర్వ్ ప్లేయర్లు వేసుకునే ప్రత్యేక జెర్సీ ధరించిన విరాట్.. సహచరులకు నీళ్లు, అరటిపండ్లు మోసుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కోహ్లీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఇలాంటి చర్యలతో విరాట్ ఇంత ఎత్తుకు ఎదిగాడని కామెంట్లు చేస్తున్నారు.
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం.. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20కి టీమ్ మేనేజ్ మెంట్ ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చింది. దీంతో కోహ్లీ, రోహిత్ బెంచ్ కే పరిమితం కాగా.. హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించాడు. చాన్నాళ్లుగా డగౌట్ కే పరిమితమవుతూ వస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కింది. సీనియర్లు లేని భారత బ్యాటింగ్ లైనప్ పేలవ ప్రదర్శన కనబర్చి పరాజయం మూటగట్టుకున్నా.. కోహ్లీ వాటర్ బాయ్ అవతారమెత్తడం అభిమానులను కట్టిపడేసింది. అంతర్జాతీయ స్థాయిలో లెక్కలేనన్ని రికార్డులు కొల్లగొట్టి కింగ్ అనే బిరుదు దక్కించుకున్న కోహ్లీ.. డౌన్ టు ఎర్త్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ క్రమంలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ తో కలిసి కోహ్లీ.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కు డ్రింక్స్ అందించాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మరి నిర్ణయాత్మక పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. కోహ్లీ డ్రింక్స్ బాయ్ అవతారమెత్తడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
1 hi to ❤️ hai, kitne baar jeetoge? King Kohli turns water boy!
.
.#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/CYE2uvNAC2— FanCode (@FanCode) July 29, 2023