టీంఇండియాలో విరాట్ కోహ్లీ అంటే కేవలం స్టార్ బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన కెప్టెన్ కూడా. ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదనే వెలితి మినహాయిస్తే.. కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా ఉండడం విశేషం. అయితే కెప్టెన్ గా తాను కూడా కొన్ని తప్పులు చేశానని.. కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టీంఇండియాలో విరాట్ కోహ్లీ అంటే కేవలం స్టార్ బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన కెప్టెన్ కూడా. బ్యాటింగ్ లో కోహ్లీకి ఎన్ని రికార్డులు ఉన్నాయో.. ఒక కెప్టెన్ గా కూడా ఇండియన్ క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు. ముఖ్యంగా టెస్టుల్లో తన అగ్రెస్సివ్ కెప్టెన్సీతో ఇండియాను చాలా కాలం పాటు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంచాడు. మొత్తం 68 టెస్టుల్లో 39 విజయాలు సాధించగా..మరో కేవలం 16 టెస్టుల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక 95 వన్డేల్లో 65 మ్యాచుల్లో విజయం సాధించి తన సత్తా చూపించాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదనే వెలితి మినహాయిస్తే.. కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా ఉండడం విశేషం. అయితే కెప్టెన్ గా తాను కూడా కొన్ని తప్పులు చేశానని.. విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
2016 లో మహేంద్ర సింగ్ ధోని మూడు ఫార్మాట్ లలో కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో విరాట్ కోహ్లీ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాలు కెప్టెన్ గా చేసిన విరాట్ టీంఇండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలనందించాడు. ఇక కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2021 టీ 20 ప్రపంచకప్ లో కనీసం గ్రూప్ దశ కూడా దాటకపోవడంతో టీ 20కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేసాడు. కొన్ని రోజులకి కోహ్లీ అనుమతి లేకుండానే బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో కాస్త హర్ట్ అయిన కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా చేసాడు. అయితే కెప్టెన్సీ గురించి కోహ్లీ తన మనసులో మాటలను పంచుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. “కెప్టెన్ గా నేను కొన్ని తప్పులు చేసిన మాట నిజమే. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటా. కానీ నేను స్వార్ధంగా, వ్యక్తిగత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు. నా కోసం కాకుండా టీం గెలుస్తుందని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ఎప్పుడు కూడా అనుకున్నవి జరగవు కదా. బ్యాటర్ గా తప్పులు చేస్తే ఔటైనట్లే.. కెప్టెన్ గా తప్పులు చేస్తే ఓటమిని ఒప్పుకోవాల్సిందే. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అయితే గెలవాలనే తపన మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. అందుకే ఎన్ని తప్పులు చేసినా.. మళ్ళీ మళ్ళీ విజయాల కోసం ప్రయత్నించేవాడిని. అసలు ప్రయత్నమే చేయకపోతే విజయం ఎలా వస్తుంది. నేనేం చేసినా మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే చేసాను. అయితే నేను తీసుకున్న నిర్ణయాలు కొందరికీ నచ్చేవి కాదు. నా సక్సెస్ ని ఎలా గుర్తు పెట్టుకున్నానో.. ఫెయిల్యూర్స్ ని కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాను. భారత్ కెప్టెన్ గా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసాను” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెపిలపండి.