మ్యాచ్ గెలవడం కోసం ఎవరైనా ఏం చేస్తారు? బాగా ప్రాక్టీసు చేసి ప్రత్యర్థిపై విజయం సాధిస్తారు. కానీ ఆస్ట్రేలియా మాజీలు మాత్రం టీమిండియా స్టార్ ప్లేయర్ల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు.
ఎవరైనా సరే గెలవడానికే చూస్తారు. దానికి కోసం కొందరు న్యాయంగా పోరాడితే, మరికొందరు అడ్డదారిలో విజయం సాధించాలని చూస్తారు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మాజీలు చేస్తున్నది చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ అనేది రెండు జట్లకు ముఖ్యమే. అందులో భాగంగానే మ్యాచులు ప్రారంభం కావడానికి ముందే.. ఈ సిరీస్ అంత పెద్ద విషయం ఏం కాదు, ఈజీగా గెలిచేస్తాం అని క్రికెటర్లు చాలా ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే.. తొలి టెస్టులోనే చేతులెత్తేశారు. మన స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు వణికిపోయారు. మూడు రోజుల్లోనే మ్యాచ్ పూర్తయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలో జరగబోయే రెండో టెస్టు కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘టెస్టు క్రికెట్ లో ఓపెనర్ గా వెళ్లడం రోహిత్ కెరీర్ ని కాపాడింది. మిడిలార్డర్ లో ఆడుతున్నప్పుడు అతడి టాలెంట్ వేస్ట్ అయినట్లు కనిపించింది. అప్పుడు కెప్టెన్ గా కోహ్లీకి ఉన్న పాపులారిటీ వల్ల రోహిత్ కు సరైన గుర్తింపు దక్కలేదు. నాగ్ పూర్ టెస్టులో పిచ్ ని అర్థం చేసుకుని రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు’ అని చాపెల్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని ఆసీస్ చూస్తోంది అనే డౌట్ వస్తోంది.
ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం జట్టు పరంగా బలంగా ఉంది. కెప్టెన్ రోహిత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీతోపాటు మిగిలిన వాళ్లు కాస్త సెట్ అయితే తిరుగుండదు. ఇక బౌలర్ల అయితే రెచ్చిపోయి మరీ మ్యాచుల్ని గెలిపిస్తున్నారు. ఇలాంటి టైంలో మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ఆస్ట్రేలియా ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే చాపెల్ ఈ కామెంట్స్ చేశాడా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో చాపెల్ వల్ల టీమిండియాలో వివాదాలు రేగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అలా చేసి, మ్యాచులు గెలవాలని చూస్తున్నారా అనే డౌట్ వస్తుంది. చాపెల్ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ.. ఇంత చీప్ గా ఆలోచిస్తారా? అని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.