టీ 20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వేగంగా పరుగులు ఎలా చేయాలనే దానిపై దృష్టి పెట్టారు బ్యాటర్లు. ఈ క్రమంలోనే అనేక ఫ్యాన్సీ క్రికెట్ షాట్లు పుట్టుకొచ్చాయి. అయితే భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఫ్యాన్సీ షాట్లు ఆడిన దాఖలాలు లేవు. దీంతో కోహ్లీకి ఈ షాట్స్ మీద ఆసక్తి లేదనుకున్నారంతా. ఇదిలా ఉండగా.. కోహ్లీ ఎందుకు ఫ్యాన్సీ షాట్లు ఆడట్లేదో అసలు విషయం చెప్పేసాడు.
ప్రస్తుతం క్రికెట్ లో ఫ్యాన్సీ షాట్స్ ఆడడం అందరికీ చాలా కామన్ గా మారిపోయింది. కేవలం బ్యాటర్లే కాదు..కొన్నిసార్లు బౌలర్లు కూడా ఈ ఫ్యాన్సీ షాట్స్ ఆడుతూ ఆశ్చర్యపరుస్తారు. ఒకప్పుడు ఒక్క ఫ్యాన్సీ ఆడితేనే ఔరా అనేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఫ్యాన్సీ క్రికెట్ షాట్లు చాలా వచ్చాయి. దీనికి కారణం టీ 20 క్రికెట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే టీ 20 ఫార్మాట్ వచ్చిందో అప్పటినుంచి రకరకాల క్రికెటింగ్ షాట్లు మనం చూస్తున్నాం. అయితే భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఫ్యాన్సీ షాట్లు ఆడిన దాఖలాలు లేవు. దీంతో కోహ్లీకి ఈ షాట్స్ మీద ఆసక్తి లేదనుకున్నారంతా. ఇదిలా ఉండగా.. కోహ్లీ ఎందుకు ఫ్యాన్సీ షాట్లు ఆడట్లేదో అసలు విషయం చెప్పేసాడు.
టీ 20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వేగంగా పరుగులు ఎలా చేయాలనే దానిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అనేక ఫ్యాన్సీ క్రికెట్ షాట్లు పుట్టుకొచ్చాయి. డివిల్లియర్స్ తో మొదలుకొని ఈ మధ్యే టీ 20క్రికెట్ క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తున్న సూర్య కుమార్ యాదవ్ వరకు అందరు ఈ షాట్స్ మీద ఆసక్తి చూపించినవారే. కానీ కోహ్లీ మాత్రం ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు. క్రికెట్ బుక్స్ లో ఉండే ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ క్లాస్ బ్యాటింగ్ కి కేరాఫ్ గా మారాడు. ఎప్పుడూ కూడా ఫ్యాన్సీ షాట్స్ జోలికి పోలేదు. అయితే తాజాగా కోహ్లీకి ఏ ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ.. “ఫ్యాన్సీ క్రికెట్ షాట్స్ ఆడడం నాకు ఇష్టమే. నేనేమి ఆ షాట్స్ ఆడేందుకు బయపడట్లేదు. భవిష్యత్తులో నేను టెస్ట్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్త షాట్ల మీద దృష్టి పెట్టి నా టెక్నీక్ మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు. ఈ కారణంగానే నేను ఫ్యాన్సీ షాట్స్ ఆడను”. అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం మనం ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే టీ20 క్రికెట్ కి ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ కోహ్లీ టెస్టుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం ఈ దిగ్గజాన్ని మరో మెట్టు ఎక్కిస్తుంది. మరి కోహ్లీ ఫ్యాన్సీ క్రికెటింగ్ షాట్లు ఆడకపోవడానికి చెప్పిన కారణం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.