ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భాగంగా టీమిండియా వరుస పరాజయాలతో ఎటు తేల్చుకోలేని దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. బలమైన జట్టుతో టోర్నీలో అడుగు పెట్టిన కోహ్లీ సేన ఆశించిన ఫలితాలను మాత్రం అస్సలు అందుకోలేకపోతోంది. అయితే ఆదివారం టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శనతో జట్టులోని ఆటగాళ్లంత కనీస స్థాయి ప్రదర్శనకు కూడా నోచుకోకపోవటం విశేషం. దీంతో మరోసారి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
ముందుగా బ్యాంటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే రాబట్టి ప్రతర్థి జట్టుకు అతి తక్కువ స్కోరును వారి ముందు ఉంచింది. ఇక అనంతరం బ్యాంటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది విజయాన్ని సాధించారు. దీంతో వరుస ఓటముల మధ్య టీమిండియా అతి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రికెట్ లవర్స్ టీమిండియా ఆటగాళ్లపై నెట్టింట్లో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ‘‘ఓటమికి చింతిస్తున్నాం. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం’’ అంటూ కోహ్లీ 2011, జనవరి 23న చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇక టీమిండియా ఈ టోర్నీలో అటు అధికారికంగా నిష్క్రమించకపోయినా… ముందుకు వెళ్లాలంటే ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి పరిస్థితులు వచ్చాయి.
Even after 10 years https://t.co/fHdoyxUA4y
— Ali’s Sunflower 🌻 (@BiyaAli9) October 31, 2021