టీమిండియా, బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇక తాజాగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు కూడా ప్రారంభమైపోయింది. ఈ మ్యాచ్ తొలి రోజు, మన జట్టు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. పిచ్ కూడా బౌలర్లకు సహకరిస్తుండటంతో టీమిండియా ఆరు వికెట్లు పోగొట్టుకుని 278 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(82 బ్యాటింగ్) ఉన్నారు. అయితే బ్యాట్ తో అదరగొడతాడు అనుకున్న కోహ్లీ, ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఇక ఔటైన తర్వాత కోహ్లీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ ఆటగాడైనా సరే.. తన గేమ్ ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలనే చూస్తాడు. లేదంటే మిగతా వాళ్లతో పోలిస్తే కచ్చితంగా వెనకబడిపోతాడు. ఇక టీమిండియా విషయానికొస్తే… ఒకప్పుడు ప్లేయర్స్ కొరత ఉండేది కానీ ఇప్పుడలా కాదు.. ఒక్క ప్లేస్ కోసం ముగ్గురేసి ఆటగాళ్లు రేసులో ఉన్నారు. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు స్థానం నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కోహ్లీ కూడా అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు.
అందుకే బంగ్లాదేశ్ తో తాజాగా జరుగుతున్న తొలి టెస్టులో తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే స్పిన్ బౌలింగ్ ని బాగా కోహ్లీ.. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీనిని జీర్ణించుకోలేకపోయిన విరాట్.. టీ బ్రేక్ టైంలో వెంటనే నెట్స్ లో అడుగుపెట్టేశాడు. ఈ పొరపాటు మళ్లీ రెండో ఇన్నింగ్స్ లో జరగకూడదని ఫిక్స్ అయి.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కూడా కోహ్లీ డెడికేషన్ చూసి తెగ మురిసిపోతున్నారు. మరి మ్యాచ్ మధ్యలో కోహ్లీ నెట్ ప్రాక్టీస్ చేయడంపై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Virat Kohli practicing against the left-arm spinner during tea break, the dedication to get better always. (Source – Sports Yaari) pic.twitter.com/CSg2C5jf8t
— Johns. (@CricCrazyJohns) December 14, 2022
#TestCricket #indvsbang #Kohli #ViratKohli𓃵 pic.twitter.com/TLfcQSSDxM
— Deepak Mehta (@Dpak770) December 14, 2022