భారత్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కోహ్లీ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నాడంటే.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సగం స్టేడియం కోహ్లీ ఫ్యాన్స్ తో నిండిపోతుంది. ఎన్నో చారిత్రాత్మక, మరువలేని ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. కెరీర్ అంతా సాఫీగా సాగిందంటే పొరపాటే. ఎంత గొప్ప ప్లేయర్ అయినా.. జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండడం సహజం. కోహ్లీ దీనికి మినహాయింపేమీ కాదు. కింగ్ క్రికెట్ కెరీర్ లో కూడా కొన్ని బాధ కలిగించే విషయాలు ఏమైనా ఉంటే అది కెప్టెన్సీ నుంచి అతన్ని తొలగించడమే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కోహ్లీ ప్లీజ్ ఈ ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడాలని కోరుకుంటున్నారు. ఇంతకీ దీనికి కారణమేంటి?
సాధారణంగా ఫ్యాన్స్ అంటే ప్రతి మ్యాచ్ ఆడాలని కోరుకుంటారు. ఇక కోహ్లీ ఫ్యాన్స్ అయితే ప్రతి మ్యాచులో ఏకంగా సెంచరీ చేయాలని ఆరాటపడతారు. అయితే కింగ్ ఫ్యాన్స్ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ టీ 20 కెప్టెన్ నుంచి తప్పుకున్న తర్వాత.. పరిమిత ఓవర్ల క్రికెట్ కి ఒక్కడే కెప్టెన్ ఉండాలని కోహ్లీని సంప్రదించకుండానే.. అతన్ని వన్డే బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి కారణం అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ లో కోహ్లీ, గంగూలీ మధ్య ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే దానికి మరింతగా బలం చేకూర్చారు. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని కోహ్లీ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
కోహ్లీ ఫ్యాన్స్ గంగూలీ మీద రివెంజ్ తీర్చుకునే టైం రానే వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ కి గంగూలీ కామెంటరిగా వ్యవహరిస్తున్నాడు. గంగూలీతో పాటు దినేష్ కార్తిక్ కూడా మరో కామెంటేటర్. దీంతో కోహ్లీ ఈ మ్యాచులో బాగా ఆడితే, కష్టమైనా సరే గంగూలీ.. కోహ్లీని పొగడాల్సి వస్తుంది. ఇదే జరిగితే కింగ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచులో కోహ్లీ భారీ ఇనింగ్స్ ఆడాలని ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టు కోహ్లీ ఈ మ్యాచులో చెలరేగి ఆడతాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.