గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. చివరి ఆరు నెలల్లో మాత్రం ఏకంగా 5 సెంచరీలు చేశాడు. మరి ఈ సక్సెస్ వెనక ఎవరున్నారు? కోహ్లీ సెంచరీల సీక్రెట్ ఏంటి?
విరాట్ కోహ్లీ.. నాలుగో టెస్టులోనూ సెంచరీ కొట్టేశాడు. అప్పుడెప్పుడో 2019 నవంబరు 22న ఈ ఫార్మాట్ లో శతకం చేసిన కోహ్లీ.. దాదాపు 1205 రోజుల తర్వాత మళ్లీ మూడంకెల స్కోరు అందుకున్నాడు. దాదాపు మూడేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క సెంచరీ చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. ఇప్పుడు కేవలం 6 నెలల్లోనే 5 సెంచరీలతో దుమ్మలేపాడు. తన పని అయిపోయింది అన్న వాళ్లతోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే రీఎంట్రీలో కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీల వెనక కారణాన్ని నెటిజన్స్ కనిపెట్టేశారు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా సచిన్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే దాదాపు ప్రతి ఒక్కరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ విరాట్ కోహ్లీ. చిన్న వయసులోనే జట్టులోకి వచ్చిన మనోడు.. ఆ తర్వాత మెల్లమెల్లగా తన మార్క్ బ్యాటింగ్ తో రెచ్చిపోతూ వచ్చాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ గా సెటిలైపోయిన కోహ్లీ.. వరస సెంచరీలతో దూసుకెళ్లిపోయాడు. టెస్టు, వన్డే ఫార్మాట్ లో ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులు సెట్ చేశాడు. అలా 2019 నవంబరు కల్లా అంతర్జాతీయ క్రికెట్ లో 70 శతకాలు చేశాడు. అయితే అప్పటినుంచి దాదాపు మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.
ఇక కోహ్లీ బ్యాట్ నుంచి మెరుపులు రాకపోవడంతో అందరూ కోహ్లీ పనైపోయిందన్నారు. కానీ కోహ్లీ ఈజ్ బ్యాక్ అని గతేడాది అఫ్ఘనిస్థాన్ జట్టుపై టీ20 సెంచరీ చేసి మరీ కోహ్లీ ప్రూవ్ చేశాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పై వన్డే శతకం చేసిన విరాట్.. జనవరిలో శ్రీలంకతో వన్డే సిరీస్ లో రెండు సెంచరీలు చేశాడు. ఇప్పుడు అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై శతకం చేసి తనలో ఏ మాత్రం పవర్ తగ్గలేదని ప్రూవ్ చేశాడు. అయితే కోహ్లీ చివరి మూడు సెంచరీలను తీసుకుంటే.. 73వ చేయడానికి ముందు కంచీధామ్ ని సందర్శించుకున్నాడు. 74వ సెంచరీ చేయడానికి ముందు విృందావన్ కి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఆసీస్ పై 75వ సెంచరీ చేయడానికి ముందు ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయానికి భార్యతో కలిసి వెళ్లి వచ్చాడు. దీంతో కోహ్లీ సెంచరీల వెనక.. దైవ దర్శనమే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి కోహ్లీ సెంచరీల వెనక దేవుడు ఉన్నాడనే కామెంట్స్ పై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
महाकाल की शरण में आने के तुरंत बाद #Kohli का टेस्ट में शतक#ViratKohli𓃵 #ViratKohli pic.twitter.com/KGlfIuQUBL
— शुभम त्रिपाठी (@TheShubhamtv) March 12, 2023