బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. తొలి రెండు వన్డేల్లో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత జట్టు.. పరువు పొగొట్టుకోవడంతో పాటు సిరీస్‌ను సైతం కోల్పోయింది. దీంతో కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి.. పసికూన బంగ్లా చేతిలో క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లో గెలిచే మ్యాచ్‌లను చేజేతులా ఓడిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో గెలవాలనే కసితో ఉంది. అయితే.. మూడో వన్డే కోసం భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెండో వన్డేలో గాయమైన విషయం తెలిసిందే.
మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. అనముల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోబోయి రోహిత్ గాయపడ్డాడు. బంతి బలంగా అతని ఎడమ చేయి బోటనవేలికి తగలడంతో రోహిత్ నొప్పితో వెంటనే మైదానం వీడాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి సైతం వెళ్లాడు. కొద్ది సేపటికి గ్రౌండ్‌కు తిరిగి వచ్చిన రోహిత్.. మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు. చేతికి కట్టుతో డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోయాడు. అయితే.. 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి.. 28 బంతుల్లో 51 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. అప్పటికే కావాల్సిన రన్‌రేట్ భారీగా ఉండటంతో.. టీమిండియా విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
గాయంతోనే బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్.. మ్యాచ్ తర్వాత, మెరుగైన వైద్యం కోసం ఇండియాకు వచ్చేశాడు. దీంతో మూడో వన్డేలో టీమిండియాను వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. రెండో వన్డేలో రోహిత్ గాయంతో బయటికి వెళ్లిన సమయంలో స్టాండ్‌ఇన్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. బౌలింగ్ మార్పుల్లో విఫలమై.. 69కే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాతో 271 పరుగులు కొట్టించాడు. దీంతో.. రెండో వన్డేలో టీమిండియా ఓటమికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ సైతం ఒక కారణమని క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అయినా కూడా మళ్లీ మూడో వన్డేకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడనే విషయం తెలిసి.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు సిరీస్‌కు రోహిత్ అందుబాటులో లేకుంటే.. బుమ్రా కూడా లేని కారణంగా టెస్టుల్లోనూ కేఎల్ రాహులే కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది.
KL Rahul set to lead India in the absence of Rohit Sharma in the Test series against Bangladesh.
If he’s the only contender, make him permanent captain then, we’ve enough of this jigsaw puzzle already ! @BCCI • @klrahul • #BANvIND pic.twitter.com/Ch7bc45fuv
— 𝐒𝐚𝐮𝐫𝐚𝐛𝐡 𝐓𝐫𝐢𝐩𝐚𝐭𝐡𝐢 (@SaurabhTripathS) December 9, 2022