ఆసియా కప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ టోర్నీలో గ్రూప్ ఏ నుంచి సూపర్ ఫోర్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో పెద్దగా స్కోర్ చేయలేకపోయిన టీమిండియా ఓపెనర్లు.. హాంకాంగ్‌తో మాత్రం దుమ్ములేపుతారని అంతా భావించారు. కానీ.. మళ్లీ పాకిస్థాన్‌తోనే ఆడుతున్నారా? అనే అనుమానం కలిగేలా ఇన్నింగ్స్ 15వ ఓవర్ వరకు స్లో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే మరీ అధ్వానంగా ఆడాడు.
6 ఓవర్ల పవర్‌ప్లే ముగిసే సరికి టీమిండియా 44 పరుగులు చేసి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లేలోకి 36 బంతుల్లో 20 బంతులు రాహులే ఆడాడు. కానీ.. అతను చేసిన పరుగుల మాత్రం 16. మొత్తం మీద 39 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 36 పరుగులు చేసి ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఘజాన్‌ఫర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సిక్సులు ఉన్నా ఒక్క ఫోర్ కూడా లేదు. పైగా రెండు సిక్సుల్లో ఒకటి ఫ్రీహిట్ బాల్‌కు వచ్చింది. ఆసియా కప్ లాంటి వేదికగాపై హాంకాంగ్ లాంటి చిన్న టీమ్‌పై కేఎల్ రాహుల్ ఇలాంటి చెత్త ఇన్నింగ్స్ ఆడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరమైన రాహుల్ ఆసియా కప్‌తో జట్టులోకి వచ్చి పాకిస్థాన్‌పై గోల్డెన్ డక్ అయ్యాడు. అందుకే హాంకాంగ్‌తో మ్యాచ్‌లో కొంత సమయం తీసుకున్నాడంటూ సమర్థన వినిపిస్తున్నా.. మరీ ఇంత జిడ్డు ఇన్నింగ్స్ అయితే ఆడాల్సిన అవసరం లేదు. కోహ్లీ లాంటి ఆటగాడు ఫామ్‌లేమితో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నా.. ఇంత చెత్త ఇన్నింగ్స్‌ను ఆడలేదు. కొంత సమయం తీసుకుని ఆడాలని అనుకుంటే.. కనీసం సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ అయినా రొటేట్ చేయాలి. అలా కాకుండా డట్స్ బాల్స్‌గా ఆడటంతో మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఒత్తిడి పెరిగింది. ఇదే ఒత్తిడిలో రోహిత్ శర్మ భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రోహిత్ అవుటైన తర్వాత కూడా కేఎల్ రాహుల్ తీరులో మార్పు రాలేదు. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీపై కూడా ఒత్తిడి పడింది. కానీ.. కోహ్లీ చక్కగా సింగిల్స్‌తో టైమ్ తీసుకున్నాడు.
చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండటంతో కొంత టైమ్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ.. టీ20 మ్యాచ్‌లో ఏకంగా 13వ ఓవర్ వరకు టైమ్ తీసుకుని జిడ్డు ఇన్నింగ్స్ ఆడటం మాత్రం సరైంది కాదు. కొంత టైమ్ తీసుకున్న తర్వాత వేగంగా ఆడగల సామర్థ్యం కేఎల్ రాహుల్‌కు ఉంది. అందులో ఎలాంటి సదేహం లేదు. అతను ఒక్కసారి కుదురుకుంటే భారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు కానీ.. టీ20 క్రికెట్‌కు వచ్చేసరికి ఫోర్త్ గేర్ వీలైనంత త్వరగా వేయాలి. అదే రాహుల్‌లో మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. రాబోయే మ్యాచ్‌ల్లో టీమిండియా.. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లాంటి జట్లుతో తలపడనుంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్‌తో గట్టేకాం. కానీ.. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ అలాంటి అవకాశం ఇవ్వడం అరుదు. పైగా ప్రతిసారి సూర్య ఆడాలంటే కష్టం.
బౌలింగ్ బలంతో బరిలోకి దిగే పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌తో ఇలానే 10 ఓవర్ల వరకు స్లోగా.. కుదురుకోవడానికే ఆడితే మొదటికే మోసం రావచ్చు. కేఎల్ రాహుల్ చూపిస్తున్న ఈ అప్రోచ్‌తో టీమిండియాకు కష్టాలు తప్పవు. రాహుల్ ప్రతిసారి కొంతటైమ్ తీసుకుని ఆడితే.. పరుగులు రాక మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే 10 ఓవర్ల వరకు నిదానంగా ఆడి.. తర్వాత చెలరేగితే ఓకే.. లేదా అంతసేపు నిదానంగా ఆడి హాంకాంగ్ మీద అవుట్ అయినట్లు 13వ ఓవర్‌లో అవుట్ అయితే తర్వాత వచ్చే బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దాంతో మరికొన్ని వికెట్లు పడే ప్రమాదం లేకపోలేదు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లాంటి జట్లపై ప్రారంభంలోనే పరుగులు రాకుంటే మిడిల్ ఓవర్స్‌లోనూ పరుగులు చేయడం కష్టం. ఆ విషయం తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు అర్థం అయిఉంటుంది.
ఇలాంటి పరిస్థితిల్లో కేఎల్ రాహుల్ చూపిస్తున్న ఈ స్లో అండ్ స్టడీ అప్రోచ్ టీ20 క్రికెట్‌కు సెట్ అయ్యేలా కనిపించడం లేదు. టెస్టులు, వన్డేలు అయితే పర్వాలేదు కానీ.. ఈ పొట్టి ఫార్మాట్‌కు మాత్రం ఓపెనర్‌గా వచ్చి పవర్‌ప్లేలో పరుగులు చేయకుంటే వెస్ట్. కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్‌తో మరో ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రెషర్ పెరిగి.. అతను రన్స్‌కోసం భారీ షాట్లకు వెళ్లి కొన్నిసార్లు వికెట్ పారేసుకుంటున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీ కూడా ఏమంత భీకరమైన ఫామ్‌లో లేడు. సూర్యకుమార్ యాదవ్ లేదా హార్దిక్ పాండ్యానో ఆడకుంటే టీమిండియా కథ కంచికి చేరే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టాలంటే శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్ టీమిండియాకు అవసరం. పైగా రోహిత్ శర్మ-ధావన్ జోడీకి ఇప్పటికే విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకుంది. కానీ.. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో ధావన్ లేడనే కారణంతో అతను ఫామ్‌లో ఉన్నా.. పక్కన పెట్టి, రాహుల్‌కు అవకాశం కల్పిస్తున్నారు.
కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంసన్ ఓపెనర్‌గా టీమిండియాకు బెటర్ ఆప్షన్ అవుతాడని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. సంజూ అయితే పవర్‌ప్లేలో ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తాడు. పైగా హిట్టింగ్‌ను తొలి బంతి నుంచే మొదలుపెట్టగల సమర్థుడు. అలాగే కేఎల్ రాహుల్ టీ20ల్లో ఆడిన చివరి 10 ఇన్నింగ్స్‌లను ఒక సారి పరిశీలిస్తే.. 0(2), 1(4), 0(6), 0(4), 14(17), 3(8), 18(16), 15(14), 65(49), 0(1),36(39) కొట్టాడు. అందులో కేవలం ఒకే ఒక హాఫ్‌సెంచరీ ఉంది. అది కూడా 49 బంతులు ఆడాడు. దీన్ని బట్టి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఆలోచించి.. కేఎల్ రాహుల్‌ను టెస్టు, వన్డేలకు పరిమితం చేసి టీ20ల్లో రోహిత్‌కు వేరే పార్ట్నర్‌ను చూడాలని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోని కోహ్లీ.. అయినా ఇది వరల్డ్ రికార్డ్ ఇన్నింగ్స్!
@SDhawan25 is 100 Time’s better than KL Rahul as an opener!
Do you agree ?#KLRahul #INDvsPAK #AsiaCup2022 pic.twitter.com/IFD4YnSYSt— shibin (@shibi_meppayour) August 28, 2022
#IndvsHkg
Relax KL Rahul will attack in IPL 2023 pic.twitter.com/UCnMjIQtDq— Shivani (@meme_ki_diwani) August 31, 2022
Still strongly agree that KL Rahul is not a good T20 opener, he create pressure to other batsman and he just play for his individual score.
Do you guys agree?#KLRahul#RohitSharma #ViratKohli #AsiaCupT20 #IndvsHkg pic.twitter.com/9T48YC1DgV— shibin (@shibi_meppayour) August 31, 2022