టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక చిన్నపనితో దేశభక్తిని చాటుకున్నాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. గురువారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు వారివారి జాతీయ గీతాలను ఆలపించాయి. కాగా.. భారత జాతీయ గీతం జనగణమన ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ తన నోటిలో ఉన్న చూయింగ్ గమ్‌ను తీసివేస్తాడు. ఈ చర్యతో క్రికెట్ అభిమానులు రాహుల్‌పై ప్రశంలు కురిపిస్తున్నారు.
అతను చేసింది చిన్నపనే అయినా.. జాతీయ గీతం, దేశపట్ల అతనికున్న అంకితభావం తెలుస్తుందని అంటున్నారు. కాగా గతంలో జాతీయ గీతం పాడుతున్న సమయంలో నోటిలో చూయింగ్ గమ్ నములుతూ పలువురు క్రికెటర్ల విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చకబ్వ(35), నగరవ(34), బ్రాడ్ ఎవాన్స్(33) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
ఇక 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు ఊదేశారు. జింబాబ్వే బౌలర్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా.. శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81, శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 82 పరుగులు చేసి భారత్‌కు 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్.. మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం, జాతీయ గీతానికి ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ చూయింగ్ గమ్ తీసేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు తొలి విజయం! తిట్టిపోస్తున్న ఇండియన్ ఫ్యాన్స్
KL Rahul took out the Chewing Gum from his Mouth before National Anthem 🇮🇳❤️
Proud of You @klrahul ❤️🔥#INDvsZIM | #CricketTwitter pic.twitter.com/erBYx16auA
— 𝐌𝐢𝐆𝐇𝐓𝐘 (@AryanMane45) August 18, 2022