బంగ్లాదేశ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమిండియా.. టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం చిట్టగాంగ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. రెండో వన్డే సందర్భంగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా చివరి వన్డే ఆడని విషయం తెలిసిందే. ఇంకా గాయం నుంచి కోలుకోని రోహిత్.. తొలి టెస్టుకు సైతం దూరం అయ్యాడు. అయితే.. రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే చటేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. సోమవారం బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌తో కలిసి కేఎల్ రాహుల్ టెస్టు సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద లోటని, అతన్ని జట్టు కచ్చితంగా మిస్ అవుతుంది. ఆట పట్ల అతనికున్న డెడికేషన్ అద్భుతం. అయితే రోహిత్ రెండో టెస్టుకు అందబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఒక అసాధారణమైన ఆటగాడని, ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. బంగ్లాపై టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తాడని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే.. రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వకుండా పుజారాకు ఇవ్వడంపై స్పందించిన రాహుల్.. ఆ విషయం గురించి తనకు తెలిదని అన్నాడు.
ఇక టెస్టుల్లో అగ్రెసివ్ క్రికెట్ ఆడతామని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. టెస్ట్ ఛాంపియన్‌షప్‌కు దగ్గర్లో ఉన్న నేపథ్యంలో అగ్రెసివ్ గేమ్ ఆడతామని అన్నాడు. తమ నుంచి ఈ సారి కచ్చితంగా అగ్రెసివ్ క్రికెట్ చూస్తారని రాహుల్ నమ్మకంగా చెప్పాడు. అయితే.. రాహుల్ కామెంట్లపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. వేగంగా ఆడాల్సిన టీ20, వన్డేల్లో జిడ్డు ఆటతో ఓటములకు కారణమైన రాహుల్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ చూసి షాక్ అయ్యామంటూ పేర్కొంటున్నారు. టీమ్ ఏమో కానీ.. ముందు కేఎల్ రాహుల్ అగ్రెసివ్‌గా ఆడాలని భారత క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి రాహుల్ అగ్రెసివ్ ఇంటెంట్ స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bangladesh captain Shakib Al Hasan & Indian captain KL Rahul strike a pose with the trophy.
📷: @BCCI
#BANvIND | @klrahul | @Sah75official pic.twitter.com/NM9GarnaHq
— CricTracker (@Cricketracker) December 12, 2022