దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. గురువారం జింబాబ్వేతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌తో కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. జింబాబ్వే టూర్ కోసం తొలుత ప్రకటించిన జట్టులో రాహుల్ లేనప్పటికీ.. తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసై జట్టులో చోటు దక్కించుకున్నాడు. పైగా అతనే టీమిండియాను నడిపించనున్నాడు.
గురువారం జింబాబ్వేతో తొలి వన్డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ధోని, రోహిత్ శర్మ వీరిలో ఏవర్ని ఫాలో అవుతారని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఎవరినీ ఫాలో అవ్వను. నా ఆటను నేను ఆడతా. మీరు చెప్పిన వ్యక్తులు ఎన్నో రికార్డు, గొప్ప గొప్ప విజయాలు సాధించారు. అంత గొప్ప కెప్టెన్లతో నన్ను పోల్చకండి. నేను వారి కెప్టెన్సీలో ఆడాను. సో.. ఎంతో కొంత వారి నుంచి నేర్చుకున్నాను. వాటితో నా సొంత ఆటను ఆడేందకు ప్రయత్నిస్తాను.
అలాగే కెప్టెన్‌గా నేను స్వతంత్రంగా ఉంటూనే.. జట్టులోని మిగతా సభ్యులను కూడా అంతే స్వతంత్రంగా వారి ఆటను వారు ఆడేలా ప్రొత్సహిస్తాను.’ అని కేఎల్ రాహుల్ చెప్పాడు. కాగా కేఎల్ రాహుల్‌కు కెప్టెన్‌గా ఇది రెండో సిరీస్ మాత్రమే. గతంలో రాహుల్ ఒక వన్డే సిరీస్‌కు ఒక టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న అన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. మరి జింబాబ్వేతో సిరీస్‌లోనైనా కెప్టెన్‌గా తన ఫేట్ మార్చుకోవాలని రాహుల్ దృఢ నిశ్చయంతో ఉన్నాడు. మరి కేఎల్ రాహుల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL Rahul (in Press) said “The numbers of MS Dhoni & Rohit Sharma as a captain is truly great, what they have achieved for the nation, I can’t even compare to them – I have learned a lot from both of them”.
— Johns. (@CricCrazyJohns) August 17, 2022
ఇది కూడా చదవండి: ఈ సారి పాకిస్థాన్‌కు ఆ ఛాన్స్ ఇవ్వం: రోహిత్ శర్మ