భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అంపైర్ మందలించాడు. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా వేసిన 5వ ఓవర్ మూడో బంతి వేస్తుండగా కేఎల్ రాహుల్ పక్కకు తప్పుకున్నాడు. దాంతో.. రబాడా బంతి విసరడాన్ని నిలిపివేయగా.. ఫీల్డ్ అంపైర్ మారైస్ ఎరాస్మస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేగవంతమైన రనప్‌తో వచ్చిన రబాడా పక్కకు తప్పుకున్న రాహుల్‌ను గుర్రుగా చూడటంతో.. రాహుల్ అతనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి కూడా సారీ చెప్పాడు. అయినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్ మారైస్ ”కేఎల్ కాస్త వేగంగా స్పందించేందుకు ప్రయత్నించు” అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022
ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. వాస్తవానికి బౌలర్ రనప్ తీసుకోగానే బ్యాట్స్‌మెన్ క్రీజులో స్టాన్స్ తీసుకుని.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటాడు. కానీ.. ఇక్కడ రబాడా రనప్ పూర్తయిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో స్టాన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు. దాంతో రబాడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి రాహుల్‌పై అంపైర్ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ, ద్రావిడ్, గంభీర్, పుజారా చేయలేనిది.. బుమ్రా చేశాడు! వీడియో వైరల్