ఐపీఎల్ 2022లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ విశ్రాంతి కోరుకోవడంతో.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు కెఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే.. సిరీస్ ఆరంభానికి ముందే కెఎల్ రాహుల్ గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో రాహుల్ తీవ్రంగా గాయపడడంతో వైద్యులు అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా ఇదే మొదటి అవకాశం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జూన్ 9న మొదటి టీ20.. ఆ తర్వాత 12న కటక్, 14న విశాఖపట్నం, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది టీమిండియా.
JUST IN: India captain KL Rahul has been ruled out of the opening T20I vs South Africa due to injury, vice-captain Rishabh Pant is expected to lead #INDvSA pic.twitter.com/MqiAmXqN1B
— ESPNcricinfo (@ESPNcricinfo) June 8, 2022
ఇది కూడా చదవండి: Umran Malik: నెట్స్ లో ఉమ్రాన్ మాలిక్ ఉగ్రరూపం! గంటకు 163.7 కీ.మీ.వేగంతో..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలు విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియా కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు. అయితే.. గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన రాహుల్.. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది కూడా అనుమానంగా మారింది.
India vs South Africa T20 series schedule announced.#Cricket #CricketTwitter #IPL2022 #RohitSharma𓃵 #ViratKohli pic.twitter.com/ornt7aui06
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) April 25, 2022