చాలా రోజులుగా సరైన ఫామ్‌లోలేక.. జట్టులో చోటు వేస్ట్ అనే దారుణ విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్.. మరోసారి విఫలం అయ్యాడు. ఆసీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కు అవుటై.. మరోసారి క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటికే భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న రాహుల్.. ఫామ్‌లోకి వచ్చి వారిని శాంతపర్చాలని ఎంతలా ప్రయత్నిస్తున్నా.. వర్క్ అవుట్ కావడం లేదు. ఫామ్‌లో లేకపోయినా జట్టులో చోటు కల్పిస్తున్నారనే విమర్శలకు రాహుల్ మరింత బలమిచ్చేలా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మరోసారి రాహుల్ పెద్ద స్కోర్ చేయడంలో విఫలం అయ్యాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ 41 బంతుల్లో ఒక సిక్స్‌తో 17 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా అవుట్ అయ్యాడు.
శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు చివరి సెషన్‌లోపే భారత బౌలర్లు ఆసీస్‌ను ఆలౌట్ చేసేశారు. 263 పరుగులకు ఆసీస్ చాపచుట్టేసింది. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లతో తీన్మార్ ఆడారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి నిరాశపర్చగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి.. 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే యువ క్రికెటర్ హ్యాండ్స్‌కాంబ్ 72 పరుగులతో రాణించాడు.
అయితే.. ఆసీస్‌ను ఓ మోస్తారు స్కోర్‌కు ఆలౌట్ చేసిన భారత్‌కు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి రోజు సంతోషాన్నే మిగిల్చారు. తొలి రోజు చివరి సెషన్‌లో 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జంట వికెట్ కోల్పోకుండా తొలి రోజు ను ముగించింది. ఓవర్‌నైట్ స్కోర్ 21తో రెండో రోజును ప్రారంభించిన భారత్‌కు ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ షాకిచ్చాడు. తొలుత రాహుల్‌ను అవుట్ చేసిన నాథన్ తర్వాత ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, పుజారాలను అవుట్ చేసి.. టీమిండియా దారుణంగా దెబ్బతీశాడు. అయితే.. రాహుల్ ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరిన సమయంలో రీప్లేలో కేఎల్ అవుటైనట్లు తేలడంతో రోహిత్ శర్మ ఆకాశం వైపు చూస్తూ.. తెగఫీలైపోయాడు. ఏదో ఫామ్‌లో ఉన్న బ్యాటర్ అవుటైన్లు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thank you Kl Rahul 🙏
17 run pe out 😤#INDvsAUS#KLRahul pic.twitter.com/Bqd5ppwAJn— Pranjal (@RealPranjal93) February 18, 2023