కే.ఎల్. రాహుల్.. ఇండియన్ టీమ్ ఫ్యూచర్ అంతా ఇతనిలోనే ఉంది. పవర్ హిట్టింగ్ తో పాటు, అద్భుతమైన టెక్నీక్ కూడా రాహుల్ సొంతం. టీ 20లలో కూడా నిలకడగా రాణించగలదు. ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే రాహుల్ అని చెప్పేంత స్థిరమైన ప్లేయర్. పైగా కెప్టెన్ కూడా. మరి.. ఇంత టాలెంట్ ఉన్న ఆటగాడికి ఐపీఎల్ అదృష్టం పండిపోద్ది కదా? కానీ.., రాహుల్ విషయంలో అలా జరగడం లేదు. రాహుల్ టాలెంటే అతనికి ఇప్పుడు శాపం అయ్యింది.
రాహుల్ గత కొన్ని సీజన్స్ నుండి పంజాబ్ టీమ్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రాహుల్ ఆ జట్టు కెప్టెన్ కూడా. ప్రతి సీజన్ లో పంజాబ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. కానీ.., రాహుల్ పై ప్రెజర్ పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈసారి కూడా పంజాబ్ టీమ్ రాహుల్ ని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి రాహుల్ కూడా ముందుగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. కానీ.., ఇంతలో మధ్యలోకి లక్నో దూసుకొచ్చింది. కే. ఎల్. రాహుల్ కి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది హయ్యెస్ట్ పే అనమాట. దీంతో.. రాహుల్ ఆలోచన మార్చుకున్నాడు. లక్నోకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు.
రాహుల్ పక్కకి వెళ్లిపోవడంతో పాపం పంజాబ్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. మరో మార్గం లేక పంజాబ్ మయాంక్ అగర్వాల్ ని, అర్షదీప్ సింగ్ ని మాత్రమే రిటైన్ చేసుకుంది. అది కూడా ఫామ్ లో లేని మయాంక్ కి 12 కోట్ల రూపాయలు చెల్లించి టీమ్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకు టీమ్ తోనే ఉంటాను అని చెప్పి, లాస్ట్ లో రాహుల్ తప్పుకోవడంతోనే తమకి ఈ కష్టం వచ్చిందని పంజాబ్ ఓనర్ ప్రీతీ జింటా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీతీ ఈ విషయాన్ని అప్పుడే బీసీసీఐ ద్రుష్టి కి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో లక్నో మేనేజ్మెంట్ పై కూడా ప్రీతీ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లను ప్రలోభాలకు గురి చేసి, తమ వద్దకి లాక్కుంటున్నారు అన్నది ప్రీతీ జింటా ప్రధాన ఆరోపణ.
నిజానికి ఈ విషయంలో బీసీసీఐ కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి స్టార్ ఆటగాడైన రిటైన్ పాలసీలను తప్పకుండా ఫాలో అవ్వాలి. టీమ్ లో కొనసాగడం ఇష్టం లేనప్పుడు ఆటగాళ్లు ముందుగా సమాచారం ఇచ్చి ఉండాల్సింది. ఇలా చివరలో మాట తప్పడంఫ్రాంచైజీల హక్కులకు భంగం కలిగించినట్టే అవుతుందని భావిస్తోందట. ఈ విషయంలో ప్రీతీ జింటా గనుక రిటన్ కంప్లైంట్ ఇస్తే.. బీసీసీఐ విచారణకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఈ మొత్తం అంశంలో రాహుల్ తప్పుందని తేలితే అతనిపై ఒక ఏడాది పాటు ఐపీఎల్ లో బ్యాన్ పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.