ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో భారత క్రికెట్ జట్టు పరువు పతాళానికి పడిపోయింది. క్రికెట్ అభిమానులు బంగ్లాదేశ్‌పై రెండు వరుస ఓటములతో పాటు సిరీస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో పసికూన జట్టుగా పేరమోస్తున్న బంగ్లాదేశ్ జట్టు.. పటిష్టమైన టీమిండియాను రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడించడం కంటే దారుణం ఇంకొటి ఉండదు. పైగా ఈ రెండు విజయాలు బంగ్లాదేశ్‌కు ఏదో గాలివాటంగా వచ్చిన విజయాలు కాదు.. ఓడిపోయే స్థితిలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాక్కొని మరీ ఛాంపియన్ జట్టులా ఆడి గెలిచింది. తొలి మ్యాచ్‌లో చూపించిన పోరాటాన్ని కొనసాగిస్తూ.. రెండో వన్డేలోనూ అదే తెగువను చూపిస్తూ.. సిరీస్‌ను కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. ఈ ఓటముల తర్వాత.. టీమిండియా జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఓటమిపై క్రికెట్ అభిమానులు సైతం వారివారి విశ్లేషణలు వారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీమిండియా ఓటమికి కారణాలపై జరుగుతున్న చర్చల్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోని వచ్చింది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో వారి అంచనాలు తలకిదులయ్యాయి. తొలి వన్డేలో ఏదో అలా జరిగిపోయింది కానీ.. టీమిండియా అసలు సత్తా ఏంటో ఇప్పుడు రూచి చూస్తారు అన్నట్లు.. మన బౌలర్లు ఆరంభంలో బంగ్లాదేశ్‌పై చెలరేగిపోయారు. స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అనుముల్ హక్‌ను అవుట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే మరో ఓపెనర్, బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్‌ను అవుట్ చేశాడు. సిరాజ్‌తో పాటు స్పీడ్ గన్, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా పనిపట్టాడు. ఇలా ఈ ముగ్గురు బౌలర్లు చెలరేగడంతో.. బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందో? లేదో అనే అనుమానం కలిగించింది.
కానీ.. అనూహ్యంగా పుంజుకున్న బంగ్లాదేశ్.. భారత్ ముందు ఏకంగా 272 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. తొలి వన్డే హీరో మెహిదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లాతో కలిసి 7వ వికెట్‌కు నెలకొల్పిన అమూల్యమైన భాగస్వామ్యమే బంగ్లాదేశ్ స్థితి మార్చింది. మ్యాచ్ చేతుల్లో ఉందనుకున్న భారత్‌కు.. భారీ లక్ష్యం కళ్లముందుకొచ్చింది. ఎక్కడో 69కి 6 వికెట్లుగా దీనస్థితిలో ఉన్న బంగ్లా.. 50 ఓవర్లు పూర్తిగా ఆడటమే కాకుండా.. 7 వికెట్లకు 271 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇదే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. అయితే.. ఆరంభంలో చెలరేగిన టీమిండియా బౌలర్లు తర్వాత.. తేలిపోవడం వెనుక అసలు కారణం ఇదే అంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అదే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ..!
కొంపముంచిన కేఎల్ రాహుల్ కెప్టెన్సీ..!
మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అనుముల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో గాయపడ్డాడు. దీంతో వెంటనే గ్రౌండ్ వీడి.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఫస్ట్‌ఎయిడ్ తీసుకుని, స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. ఇక కెప్టెన్ రోహిత్ గ్రౌండ్‌లో లేకపోవడంతో.. వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. ఇక తనకు మాత్రమే సాధ్యమైన ఊహకందని బౌలింగ్ మార్పులతో బంగ్లాదేశ్‌కు ఊపిరిపోశాడు. 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్‌పై మరింత ఒత్తిడి పెట్టకుండా.. బౌలింగ్ మార్పులతో మెహదీ-మహ్మదుల్లా జోడీని ప్రశాంతంగా పరుగులు చేసుకోనిచ్చాడు. దీంతో.. క్రీజ్‌లో పాతుకుపోయిన మెహిదీ-మహ్మదుల్లా ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. బంగ్లాదేశ్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. మహ్మదుల్లా 77 రన్స్ చేసి అవుటైనా.. మెహిదీ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఏకంగా సెంచరీ బాదేశాడు. 69 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. 7 వికెట్లకు 271 పరుగులు చేసిందంటే.. అందుకు కారణం కెప్టెన్ కేఎల్ రాహుల్ అని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌కు చాలా చాలా థ్యాంక్స్..!
బంగ్లాదేశ్‌పై రెండు వరుస ఓటముల తర్వాత.. టీమిండియాను ఏకిపారేస్తున్న క్రికెట్ అభిమానులు.. బంగ్లాదేశ్‌కు మాత్రం థ్యాంక్స్ చెబుతున్నారు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా చెప్పుకుంటున్న కేఎల్ రాహుల్ అసలు కెప్టెన్సీకే పనిరాడని నిరూపించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోహిత్ శర్మ తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అవుతాడనే వార్తలు అప్పుడప్పుడు వినిపించాయి. వైట్ బాల్ క్రికెట్‌లో ప్రస్తుతం అతనే టీమిండియా వైస్ కెప్టెన్ కూడా. అయితే.. రాహుల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో.. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో తేలిపోయిందని.. 69 పరుగులకే 6 వికెట్లు పడిన జట్టుతో కూడా 271 పరుగులు కొట్టించగల కెప్టెన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా జింబాబ్వేపై తప్ప ఎప్పుడూ గెలవలేదనే విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించిన మూడు వన్డేలు, ఒక టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇప్పుడు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా సైతం టీమిండియాను ముంచాడు. బంగ్లాతో రెండో వన్డేలో 28 బంతులాడిన కేఎల్ రాహుల్.. కేవలం 14 పరుగులు చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు.
We fans demand the immediate removal of Kl Rahul from every indian squad. As fans we have suffered enough because of him playing for our lovely Indian team.
How many times we have to suffer?*Your every like means you also want kl rahul dropped.#BANvIND pic.twitter.com/gMyRrhIHdw
— Passionate Fan (@Cricupdatesfast) December 7, 2022
What is this expression KL Rahul 😭😭🖐 pic.twitter.com/sQw5CSBGsA
— feryy (@ffspari) December 2, 2022