టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. ఫైనల్లీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఇక కొన్ని రోజుల మాత్రమే ఉందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే హింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక భారత జట్టు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న రాహుల్.. ఈ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. ఓపెనర్ గా ఏ మాత్రం ఆకట్టుకునే బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అతడిని జట్టులో ఉంచాలా తీసేయాలా అనే దానిపై కూడా డిస్కషన్ నడుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆటగాడి కేఎల్ రాహుల్ ని వంక పెట్టడానికి లేదు. కానీ ఐపీఎల్ లో తప్పితే టీమిండియా తరఫున ఆడినప్పుడు మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. మొన్న కూడా జరిగింది అదే. సరే అతడి కెరీర్ గురించి పక్కనబెడితే.. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టితో చాలా రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నాడు. దీని గురించి బయట ఎక్కడా చెప్పకపోయినప్పటికీ.. కలిసి టూర్స్ వెళ్తుంటారు. ఐపీఎల్ లోనూ రాహుల్ మ్యాచులు ఉన్నరోజు.. స్టేడియంకు కూడా అతియా చాలాసార్లు వచ్చింది.
అలానే సోషల్ మీడియాలోనూ ఒకరి పోస్టులకు మరొకరు లైకులు, కామెంట్స్ చేస్తూ నెటిజన్లని ఎప్పుడూ టీజ్ చేస్తుంటారు. ఇక వీళ్ల పెళ్లి గురించి చాలారోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు. తాజాగా రెండో రోజుల క్రితం పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లిన రాహుల్.. ఇప్పుడు ‘కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి’ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఇదిలా ఉండగా జనవరి 24న రాహుల్-అతియా పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఖండాలాలో సునీల్ శెట్టి మేన్షన్ లో పనులు కూడా మొదలైపోయానని టాక్. మరి కేఎల్ రాహుల్.. ఆలయాల వెంట తిరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Cricketer @klrahul visited Kukke Subrahmanya temple in Dakshina Kannada.
Kannur Lokesh Rahul (KL Rahul) essentially considers himself a Tulunadu boy having been born in Mangaluru and is known to regularly visit the temple. pic.twitter.com/wqJxUsjUFT— Gautam (@gautyou) November 23, 2022
ಸುಬ್ರಹ್ಮಣ್ಯ (ದಕ್ಷಿಣ ಕನ್ನಡ): ಕ್ರಿಕೆಟಿಗ ಕೆ ಎಲ್ ರಾಹುಲ್ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಮಣ್ಯ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬುಧವಾರ ಭೇಟಿ ನೀಡಿ ದೇವರ ದರ್ಶನ ಪಡೆದರು.#klrahul #kukkesubramanya pic.twitter.com/yEeP4gLs6X
— Prajavani (@prajavani) November 23, 2022
KL Rahul Visit Tempal 🙏
Please god bless him and give some mined 😍😘#ViratKohli𓃵 #BabarAzam #INDVSBAN #PAKvsENG pic.twitter.com/fH6XlcEYgO— Akanksha Yadav 🇮🇳❤️ (@AKANKSH48278581) November 23, 2022
KL Rahul visits Kukke Subrahmanya Temple, before the wedding announcement pic.twitter.com/JpSZcNKUao
— IPLnCricket | Everything ‘Cricket’ & #IPL2023 🏏 (@IPLnCricket) November 24, 2022
January is the month when KL Rahul & Athiya will tie the knot. They visited the Khandala bunglow recently. While the exact date has been under wraps, The couple is looking forward to a traditional wedding.
– Close to kl Rahul
(To Pinkvilla)@klrahul . #klrahul pic.twitter.com/qdIOStJa9F— ⧼KLcr𝒶zyboy⧽ (@klcrazyboy) November 22, 2022