టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ.. తాజాగా వారి వివాహం వాయిదా పడినట్లు సమాచారం. చాలా కాలంగా అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ అనే సందర్భాల్లో కలిసి తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ ప్రేమ జంట పెళ్లితో ఈ ఏడాది ఒక్కటవుతారని అంతా భావించారు. కానీ.. అతియా, కేఎల్ రాహుల్ కుటుంబాలు వారి ప్రణాళికలలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు తెలుస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో కాకుండా, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో అంటే 2023 ప్రారంభంలో పెళ్లి పెట్టుకోవాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం. దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరిగే అవకాశం ఉంది.
పెళ్లి తర్వాత అతియా-కేఎల్ రాహుల్ కొత్త ఇంట్లో కాపురం పెట్టనున్నారు. కాగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో ఆడేందుకు కరేబియన్ దేశానికి వెళ్లాడు. దీనికి ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్‌రాహుల్ జర్మనీలో కాలి గజ్జకు ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మరి పెళ్లి మాట పక్కన పెట్టి ఆటపైనే తన పూర్తి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి వీరి పెళ్లి పోస్టుపోన్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Actress Athiya Shetty and cricketer KL Rahul will reportedly exchange wedding vows in the first quarter of 2023https://t.co/mjlDspHr21
— WION Showbiz (@WIONShowbiz) July 19, 2022