టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ ఊరట లభించింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ ఇద్దరిని జోధ్‌పూర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరితో పాటు షో హోస్ట్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి బయటపడ్డాడు. 2018లో కాఫీ విత్ కరణ్ షో సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు హార్ధిక్ పాండ్యా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.
రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. సర్వత్రా విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ వారిపై చర్యలు కూడా తీసుకుంది. క్రికెటర్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా.. విమర్శలు ఆగలేదు. ఈ విషయమై డాక్టర్ మేఘ్ వాల్.. రాహుల్, హార్థిక్ సహా కరణ్ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A Jodhpur Court on Tuesday granted relief to cricketers Hardik Pandya, KL Rahul and film director Karan Johar over remarks made on Koffee With Karan https://t.co/8W1Vq21QwA
— OpIndia.com (@OpIndia_com) August 2, 2022
ఇది కూడా చదవండి: కుంబ్లేని సెలక్ట్ చేయకుంటే.. ఇక్కడ నుంచి కదలను! ఆ రోజు గంగూలీ ఉగ్రరూపమే!