ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్నటి వరకు విమర్శలు ఎదుర్కొన్న రాహుల్... ఈ ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
చెత్త ఫామ్‌లో ఉన్నాడు, జట్టులో ఉంచడం వేస్ట్, అతని కంటే అక్కినేని అఖిల్ బెస్ట్ అంటూ.. కేఎల్ రాహుల్‌పై కొన్ని నెలలుగా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. బీసీసీఐ సైతం రాహుల్‌ను భారత జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో రాహుల్‌ను పక్కన పెట్టేశారు. ఇన్ని అవమానాలను కామ్‌గా భరించిన కేఎల్ రాహుల్.. ఎప్పుడూ కూడా నోరు తెరిచి ఒక్క మాట్లాడలేదు. ట్విట్టర్‌లో ఒక్క ట్వీట్ కూడా ట్వీటలేదు. కేవలం తన బ్యాటింగ్‌తోనే అందరికి సమాధానం చెప్పాడు. ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేల్లో ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇన్నిరోజులు అందరితో తిట్లు తిన్న రాహుల్.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో హీరోగా మారిపోయాడు.
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమైన చోట, ఆసీస్ పేసర్లు స్వింగ్‌తో నిప్పులు చెరుగుతున్న పిచ్‌పై.. భారత్‌ను గెలిపించేందుకు అడ్డుగోడలా నిలబడిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో 39కే నాలుగు వికెట్లు పడిపోయిన ఓటమి దిశగా సాగుతున్న జట్టుకు విజయం వైపు నడిపించాడు.. అద్వితీయమైన గెలుపును అందించాడు. కేఎల్ రాహుల్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నుంచి మంచి సహకరం లభించింది. టార్గెట్ చిన్నదే అయినా.. పిచ్ బౌలర్లుకు అనుకూలిస్తున్న తీరు చూస్తే అదే కొండంత లక్ష్యంగా కనిపించింది. రాహుల్ పోరాటంతో చిన్నగా కనిపించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 188 పరుగులకే భారత్ బౌలర్లు ఆలౌట్ చేయడంతో.. టీమిండియా సులువుగా గెలుస్తుందని భావించారు. కానీ.. ఛేజింగ్ దిగిన తర్వాత అసలు విషయం అర్థమైంది. పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా లేదు. కోహ్లీ లాంటి కింగే.. 4 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అతనితోపాటు ఓపెనర్ ఇషాన్ కిషన్ 3, సూర్యకుమార్ యాదవ్ 0, గిల్ 20, పాండ్యా 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్న రాహుల్ మాత్రం.. ఒక ఎండ్‌లో మహావృక్షంలా నిలబడిపోయాడు. అతనికి కొద్ది సేపు పాండ్యాను మంచి సపోర్ట్ వచ్చింది. పాండ్యా అవుట్ తర్వాత జడేజా-రాహుల్ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకుని.. టీమిండియాను గెలిపించారు. రాహుల్ 91 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్‌తో 75 పరుగులతో అదరగొట్టగా.. అలాగే జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసి రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An excellent knock from @klrahul here in Mumbai when the going got tough!#TeamIndia 22 runs away from victory.
Live – https://t.co/8mvcwAwwah #INDvAUS @mastercardindia pic.twitter.com/Ct4Gq1R1ox
— BCCI (@BCCI) March 17, 2023