ఐపీఎల్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేది కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు అంటూ వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదేదో గాలి మాట కాదండోయ్.. దానికి బలమైన కారణాలు కూడా చెబుతున్నారు నెటిజన్లు. కేవలం ఒకే ఒక్క ఆటగాడు కేకేఆర్ జట్టులో ఉండటమే ఆ కారణం. మరి ఆటగాడు ఎవరు?
IPL.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పండగ. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ఆయుధాలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే కొన్ని జట్లకు స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా దూరం అయ్యారు. మరికొన్ని జట్లకు స్టార్ ప్లేయర్స్ యాడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేది కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు అంటూ వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదేదో గాలి మాట కాదండోయ్.. దానికి బలమైన కారణాలు కూడా చెబుతున్నారు నెటిజన్లు, క్రీడా విశ్లేషకులు. కేవలం ఒకే ఒక్క ఆటగాడు కేకేఆర్ జట్టులో ఉండటమే ఆ కారణం. మరి ఆటగాడు ఎవరు? ఎందుకు అంత స్పెషలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోల్ కత్తా నైట్ రైడర్స్.. ఐపీఎల్ చరిత్రలో రెండు టైటిల్స్ ను నెగ్గి తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2014లో పంజాబ్ ను ఓడించి రెండో సారి విజేతగా నిలిచింది కేకేఆర్. ఇక ప్రస్తుతం 2023 ఐపీఎల్ ట్రోఫీని సైతం కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది కేకేఆర్. అదీకాక తాజాగా కేకేఆర్ జట్టు కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ అయిన నితీశ్ రాణాను నియమించింది. అయితే ఈసారి ఎన్ని టీమ్ లు వచ్చినా గానీ కప్ కొట్టేది మాత్రం కేకేఆర్ అంటున్నారు నెటిజన్లు. వారితో పాటుగా గణాంకాలు సైతం కేకేఆర్ కే మెుగ్గుచూపుతున్నాయి. కేవలం ఒకే ఒక్క ప్లేయర్ కారణంగా కోల్ కత్తా ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టబోతోంది. ఆ ఒకేఒక్క ప్లేయర్ ఎవరో తెలుసా? డేవిడ్ వైస్.. అనామక దేశమైన నమీబియా జట్టులో ఇతడు స్టార్ ప్లేయర్.
స్టార్ ఆల్ రౌండర్ అయిన డేవిడ్.. ఏ జట్టుకు ఆడితే, ఆ జట్టు కప్ కొట్టడం పక్కా. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అవును డేవిడ్ రీసెంట్ గా ఆడిన మూడు టోర్నీల్లో అతడి జట్టే విజేతగా నిలిచి టైటిల్స్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, యూఏఈ టీ10 లీగ్ ల్లో కప్ కైవసం చేసుకున్న జట్లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు. దాంతో ఈసారి కప్ కేకేఆర్ దే అని బల్లగుద్ది చెబుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వార్త క్రీడా ప్రపంచాన్ని ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. ఇక పోతే ఇతడు జట్టులో ఉండటం అదృష్టం ఒక్కటే కాదు.. డేవిడ్ ఓ నిఖార్సైన ఆల్ రౌండర్. బంతితో పాటుగా బ్యాట్ తోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపించగలడు. అందుకే ఈసారి ఐపీఎల్ 2023 కప్ కొట్టబోయేది కేకేఆర్ అంటున్నారు నెటిజన్లు. మరి డేవిడ్ వైస్ కేకేఆర్ కు మూడో ఐపీఎల్ కప్ ను అందిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Back 2 back @thePSLt20 champions 🏆🏆
So proud of what this @lahoreqalandars team has achieved!! pic.twitter.com/8T60QGj6is— David Wiese (@David_Wiese) March 19, 2023
🏆🏆🏆
What a month it’s been in Dubai!! Champions of the inaugural @ILT20Official @GulfGiants #ilt20 #gulfgiants #bringiton #champions pic.twitter.com/2nwWwxPtLy— David Wiese (@David_Wiese) February 14, 2023