కింగ్ కోహ్లీ, పరుగుల యంత్రం ఈ పేర్లు, ఆ ఘనత ఊరికే రాలేదు. దాని వెనుక ఎంతో కృషి, అలుపెరుగని కష్టం దాగుంది. ఓవల్ వేదికగా నాలుగో టెస్టు మొదటిరోజున అత్యంత వేగంగా 23 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మైదానంలో కోహ్లీ వేగం తగ్గిందనే చెప్పాలి. కానీ, సోషల్ మీడియా వేదికగా ఓ అరుదైన రికార్డు సాధిచాడు కింగ్ కోహ్లీ.
ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ ఫాలోవర్లను కిలిగిన ఏకైక క్రికెటింగ్ సెలబ్రిటీగా రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాలో 150 మిలియన్ ఫాలోవర్లు కలిగిన తొలి ఏషియన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. 150 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటిన నాలుగో స్పోర్టింగ్ సెలబ్రిట్రీగా కోహ్లీ నిలిచాడు. 337 మిలియన్ ఫాలోవర్స్‌తో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. 260 మిలియన్ పాలోవర్స్‌తో లియోనల్ మెస్సీ, 160 మిలియన్ ఫాలోవర్స్‌తో నేమర్, కోహ్లీ కంటే ముందున్నారు.