బిగ్ మ్యాన్ పొలార్డ్ పిచ్చికొట్డుడుకు పాపం.. పాకిస్థాన్ స్టార్ బౌలర్లు బలైపోయారు. సిక్సులను మంచి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టే పొలార్డ్.. కసితో కొడితే ఎలా ఉంటుందో.. షాహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్ రుచి చూశారు.
కరేబియన్ వీరుడు, బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ కొట్టుడు ఎలా ఉంటుందో కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు చూశారు, ఆస్వాదించారు. పొలార్డ్ కొట్టడం మొదలుపెడితే.. సింహం జింకను వేటాడినట్లు, పెద్ద భవనం కూలి చిన్న పిట్టపై పడినట్లు, సునామీ వచ్చి తెప్పను ముంచేసినట్లు ఉంటుంది. అలాంటి నాటు నాటు కొట్టుడిని తాజాగా పాకిస్థాన్ స్టార్ బౌలర్లుగా చెలామణీ అవుతున్న షాహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్ రుచి చూశారు. పొలార్డ్ కొట్టిన కొట్డుడుకి వారి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది.. అందుకే టోర్నీలో టాప్ టీమ్‌గా ఉన్న జట్టు.. క్వాలిఫయర్‌లో 76కే కుప్పకూలింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ 8లో భాగంగా లాహోర్ కలందర్స్-ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పొలార్డ్ తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిదీ వేసిన 19వ ఓవర్‌లో దుమ్ముదుమారం చేశాడు. ఒకే ఓవర్‌లో మూడు సిక్సులు బాది.. అఫ్రిదీకి చుక్కలు చూపించాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లోనే మూడో బంతికి కొట్టిన సిక్స్‌తోనే పొలార్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకు ముందు ఓవర్‌లోనే హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో 13 రన్స్ బాదిన పొలార్డ్. ఒక్క షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లోనే నాలుగు సిక్సులు బాదేశాడు. మొత్తం మీద 34 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సులతో 57 పరుగులు సాధించాడు. పొలార్డ్ విజృంభణతో ముల్తాన్ సుల్తాన్ స్కోర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులుగా నమోదైంది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్ 29, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 33 పరుగులతో పాకిస్థాన్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. కానీ.. వన్ డౌన్‌లో వచ్చిన రోసోవ్ 12 బంతుల్లో 13 మాత్రమే చేయడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. కానీ.. పొలార్డ్ చెలరేగడంతో ఆ మాత్రం స్కోర్ అయినా దక్కింది. ఇక 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ కలందర్స్ 14.3 ఓవర్లలోనే 76 పరుగులకే కుప్పకూలింది. సామ్ బిల్లింగ్స్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక మ్యాచ్ విజయంతో ముల్తాన్ సుల్తాన్ పీఎస్‌ఎల్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. లాహోర్ కలందర్స్‌కు మరో అవకాశం ఉంది. బాబర్ అజమ్ కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ, ఇస్లామాబాద్ యూనైటెడ్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో షాహీన్ అఫ్రిదీ సారథ్యంలోని లాహోర్ క్వాలిఫైయర్ టూలో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో లాహోర్ విజయం సాధిస్తే.. ఫైనల్ మాల్తాన్-లాహోర్ జట్ల మధ్యే జరగనుంది. అయితే.. పొల్డార్ విశ్వరూపంతో షాహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్ కాన్ఫిడెన్స్ కాస్త దెబ్బతిని ఉంటుంది. మళ్లీ పొలార్డ్‌కు ఫైనల్‌లో బౌలింగ్ చేయాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సి విషయమే. అయితే.. పొల్డార్ ఈ స్థాయిలో చెలరేగుతున్నా.. ఐపీఎల్‌లో మాత్రం అతని మెరుపుల చూడలేం. ఎందుకుంటే పొలార్డ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
పొల్డార్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడం కంటే ముందే.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ పొలార్డ్‌ను తప్పించాలనే ఆలోచన చేసింది. వాళ్లు తప్పించే కంటే తానే గౌరవంగా తప్పుకుంటానని, ఆడితే ముంబైకే ఆడాతను కానీ మరో ఫ్రాంచైజ్‌కు ఆడనని పొలార్డ్ తన లాయలిటీని చూపించడంతో.. తప్పు తెలుసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ వెంటనే పొలార్డ్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. కానీ.. ప్రస్తుతం పొలార్డ్ ఉన్న ఫామ్, ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఈ ఏడాది కూడా అతని సేవలు ఐపీఎల్‌లో వినియోగించుకొని ఉండాల్సిందని ముంబై ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ముంబై మేనేజ్‌మెంట్ పొలార్డ్‌ను తప్పించి తప్పుచేసిందని అంటున్నారు. మరి షాహీన్ అఫ్రిదీ, హరీస్ రూఫ్‌పై పొలార్డ్ దండయాత్రతో పాటు, ఐపీఎల్‌లో పొలార్డ్ బ్యాటింగ్ మిస్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pollard, the beast vs Rauf & Shaheen. pic.twitter.com/LaePFvuMLe
— Johns. (@CricCrazyJohns) March 15, 2023