బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరింత కసితో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. యూఏఈ వేదికగా ఇటివల ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పుడు మరో ఫిఫ్టీతో రెచ్చిపోయాడు. ఎంఐ ఎమిరేట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. పొలార్డ్ ఇటివల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాడు.. యూఏఈలో మాత్రం అదే ముంబైకి చెందిన ఎంఐ ఎమిరేట్స్ తరఫున రెచ్చిపోయి ఆడుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్‌తో పాట్ ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైతం ఆశ్యర్యపోతుంది. ఆదివారం డిజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో పొలార్డ్ హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ముఖ్యంగా సామ్ కరన్ వాళ్ల అన్న టామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అయితే విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సులు, రెండు ఫోర్లతో పాటు రెండు వైడ్లు పడటంతో మొత్తం 28 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6,0,వైడ్, వైడ్,6,4,6,4తో మొత్తం 28 రన్స్ వచ్చాయి. పొలార్డ్‌తో పాటు ఎంఐ ఎమిరేట్స్ ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (50), మొహమ్మద్ వసీమ్(84) పరుగులతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన డిజర్ట్ వైపర్స్ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. 12.1 ఓవర్లలో కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయి.. వైపర్స్ జట్టు 157 పరుగుల భారీ తేడాతో ఓడింది.
ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌సెంచరీతో రాణించిన పొలార్డ్.. చాలా ఏళ్లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ముంబై ఐపీఎల్ 2023 మినీ ఆక‌్షన్‌కు ముందు రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. అయితే.. ముంబై తనను పంపించేకంటే.. తానే గౌరవప్రదంగా ముంబై నుంచి బయటికి వెళ్లేందుకు.. ఐపీఎల్‌కే పొలార్డ్ రిటైర్మెట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో ఆడితే అది ముంబై తరఫున మాత్రమే ఆడతానని.. అలా కాని పక్షంలో తాను అసలు ఐపీఎల్ ఆడని.. గుడ్‌బై చెప్పాడు. పొలార్డ్ విశ్వసనీయత చూసి.. ఆశ్చర్యపోయిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెంటనే పొలార్డ్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఐపీఎల్ 2023 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
Vintage Kieron Pollard in the #ILT20 💪https://t.co/9k6k8TFR3v pic.twitter.com/a9RFQ7KhyN
— ESPNcricinfo (@ESPNcricinfo) January 30, 2023
Kieron Pollard smashed some massive hits in his half century yesterday to lead his team to a huge win.#SultanAaGayya
pic.twitter.com/Z0Q4KGNxpW— Multan Sultans (@MultanSultans) January 30, 2023