ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తావన రాగానే సిక్సులు, ఫోర్లే గుర్తొస్తాయి. ఈ లీగ్ కి ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్ ఉంది. అందుకే దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ లో ఆడేందుకు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. ఈ లీగ్ కి ఉన్న మ్యాజిల్ అలాంటిది. ఇప్పటివరకు పద్నాలుగు సీజన్లు జరగ్గా.. ఏ ఏడాదికి ఆ ఏడాది రేంజ్ పెంచుకుంటూ పోయిందే తప్ప.. ఏనాడు డౌన్ కాలేదు. అలానే సీనియర్ క్రికెటర్లు, జూనియర్ క్రికెటర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసిపోయి మరీ ఈ లీగ్ ని విజయవంతం చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో భారత క్రికెటర్లు చాలామంది ఉన్నారు. విదేశీ క్రికెటర్లకు కూడా ఏం కొదవ లేదు. ఎందుకంటే అప్పట్లో కరీబియన్ లీగ్ లో ట్రిన్ డాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున సిక్సులతో అదరగొట్టిన పొలార్డ్.. 2010లో ఐపీఎల్ అడుగుపెట్టాడు. ముంబయి ఇండియన్స్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి పొలార్డ్ ప్రస్థానం మొదలైంది. బ్యాట్, బాల్ తో తన మార్క్ చూపించాడు. ముంబయి జట్టు గెలుచుకున్న ఐదు ట్రోఫీల్లోనూ పొలార్డ్ పాత్ర కూడా మరిచిపోలేం.
ఇక 2010లో ముంబయిలో చేరిన పొలార్డ్.. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించేంత వరకు ఈ జట్టులోనే కొనసాగాడు. తాజాగా మినీ వేలం జరిగిన సందర్భంగా జట్టుతో జరిగిన చర్చల తర్వాత ఐపీఎల్ టోర్నీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని చెబుతూ ఇన్ స్టా లో సుధీర్ఘమైన పోస్టు పెట్టారు. ముంబయి జట్టుతో తన అనుబంధం గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఈ జట్టులో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నానని రాసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు. అలానే వచ్చే సీజన్ నుంచి ముంబయి జట్టుకి బ్యాటింగ్ కోచ్ కాబోతున్నట్లు కూడా తన ఇన్ స్టా నోట్ లో తెలిపాడు. మరి పొలార్డ్, ఐపీఎల్ కు వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.