స్టార్ క్రికెటర్, వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఎంత టాలెంటెడ్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ షాట్లు, లాంగ్ ఇన్సింగ్స్‌లతో టీ20 క్రికెట్‌లో మోస్టవాంటెడ్ క్రికెటర్‌గా ఎదిగాడు. మైదానంలో అద్భుత ఆటతోనే కాక కోపంతో, వివాదాలతో కూడా పొలార్డ్ వార్తల్లో నిలిచాడు. కానీ ఈ మధ్య కాలంలో మరి దారుణంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు పొలార్డ్‌ను విమర్శిస్తున్నారు. అకారణమైన కోపం ప్రదర్శిస్తూ.. పిల్ల చేష్టలతో యువ క్రికెటర్లపై అహంకారంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్‌లో ఆడుతున్న పొలార్డ్.. తన అతి ప్రవర్తనతో విమర్శల పాలు అవుతున్నాడు. ప్రస్తుతం పొలార్డ్ అతి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక సీనియర్ క్రికెటర్‌గా ఓర్పు, సహనంతో యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన పొలార్డ్ ఇలా అహంకరంగా ప్రవర్తించడం సరికాదని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. పొలార్డ్ నిఖార్సయిన టీ20 ఆటగాడు.. అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి ప్రవర్తనతో అనవసరంగా తన స్థాయిని తగ్గించుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో కూడా పొలార్డ్ అతికోసం చూశాం. బౌలర్లపై ఏకంగా బ్యాట్ విసరడం కూడా చేశాడు. ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉన్న పొలార్డ్ కొంచెం సహనంతో ఉండాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి పొలార్డ్ అతి ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
National side’s C-VC pic.twitter.com/ab1dJEBbR3
— Abhay (@ImAbhay3) February 28, 2022