వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, టీ20 స్పెషలిస్టు కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 20) ట్విటర్ వేదికగా పొలార్డ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపిన పోలార్డ్.. క్రికెట్ లో తన ప్రయాణం పట్ల గర్వంగా ఉందన్నాడు. అయితే లీగ్ క్రికెట్ ఆడటంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ వరుస ఓటముల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 స్పెషలిస్టుగా పేరొందిన పోలార్డ్.. ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించిన సందర్భాలు అనేకం. జట్టు కష్టాల్లో ఉన్నా.. క్రీజులో పోలార్డ్ ఉన్నాడంటే ఆ మ్యాచ్ ఇంకా అయిపోలేదనే అర్థం. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్.. అంచనాల మేరకు రాణించలేకపోతున్నాడు. అల్ రౌండర్ గా మంచి పేరున్నప్పటికీ.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. అతని ఘోర వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
POLLARD BIDS FAREWELL TO INTERNATIONAL CRICKET.@windiescricket ❤️❤️.
PS… thank you @insignia_sports for putting this trip down memory lane together to support my statement. https://t.co/1E87uGw1rH— Kieron Pollard (@KieronPollard55) April 20, 2022
ఇది కూడా చదవండి: అన్‌సోల్డ్ ప్లేయర్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్! రేపో మాపో జట్టులోకి..
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్.. ఆ జట్టు తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీసిన పొలార్డ్.. 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు బాదాడు. టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. ఇక.. 2010లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలార్డ్ ఇప్పటివరకు 184 మ్యాచులు ఆది 3350 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.