చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్ గా ఎన్నికైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ పొగడ్తలు కురిపించాడు. జడేజాను సీఎస్కే కెప్టెన్ గా ఎన్నుకోవడం పట్ల అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదని అన్నారు. జడ్డూ ధోనీలా చాలా కూల్ గా ఉంటూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడని అభిప్రాయాపడ్డాడు.
ఇది కూడా చదవండి: ధోని రాజీనామాపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్! కోహ్లీని మర్చిపోయాడు
T20ల్లో ఎంతో అనుభం ఉన్న గొప్ప ప్లేయర్ జడేజానే అంటూ పీటర్సన్ జడేజాపై ప్రశంసలు కురిపించాడు. ఇక శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై టీం వర్సెస్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆల్ రౌండర్ జడేజాపై కెవిన్ పీటర్సన్ చేసిన ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.