టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్‌ని మించిన క్రికెటర్ మరొకరు వెలుగులోకి వచ్చారు. యువీ ఒక ఓవర్‌లో 36 పరుగులు చేస్తే.. ఈ బ్యాటర్ ఒకే ఓవర్‌లో 46 పరుగులు బాదాడు. అతనెవరో ఇప్పుడే చూసేయండి.
ఓవర్‌కు ఆరు బంతులు.. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన 36 పరుగులు సాధ్యం. ఇప్పటికే ఈ విషయాన్ని సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ నిరూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ.. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఈ బౌలర్ బ్రాడ్‌ని ముంచినోడు.. అందుకే ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. కాకుంటే ఈ మ్యాచ్ రిజిస్టర్డ్ టోర్నీ కాదు కనుక స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉన్న రికార్డు అలానే ఉండిపోయింది. ఈ అరుదైన ఘటన ‘కేసీసీ టీ20 ట్రోఫీ’లో చోటుచేసుకుంది.
‘6nb 4b 6 6nb 6 6 6 4..’ చూశారుగా..! మొత్తంగా 8 బంతులు వేసిన ఈ గొప్ప బౌలర్ పేరు.. హర్మన్. అప్పటికే ఒక ఓవర్‌లో 22 పరుగులు సమర్పించుకున్న హర్మన్ మరోసారి బంతి అందుకొని ఈ చెత్త రికార్డుకు కారకుడయ్యాడు. ఒక్క బంతిని డాట్ పెట్టించకపోవడం కాదు కదా! ఒక్కటంటే ఒక్కటీ బ్యాటర్ వైపు సరిగా విసరలేకపోయాడు. అయితే ఆన్ సైడ్, లేదంటే ఆఫ్ సైడ్, అంతకు కాదంటే బ్యాటర్ నెత్తి మీదకు విసిరాడు. ఇంకా చెప్పాలంటే ఈ 46 పరుగుల వెనుక కీపర్ హస్తం కూడా ఉంది. వేయక.. వేయక వేసినా ఒక మంచి బంతిని కీపర్ వదిలేశాడు. దీంతో 4 పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఈ బౌలర్ కనిపిస్తే.. సన్మానం చేయాల్సిందే. యూరోపియన్ టీ20 లీగ్, కేసీసీ టీ20 ట్రోఫీ వంటి టోర్నీల్లో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోను మీరూ తిలకించి బౌలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A 46 run over in the KCC T20 trophy. pic.twitter.com/KNwdYO7G3m
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023