బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ కథ దాదాపు ముగిసినట్టే. అతని స్థానంలో 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్స్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనధికారికంగా జరిగిన బీసీసీఐ పెద్దల భేటీలో గంగూలీని అధ్యక్ష పదవిని వదులుకోమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ స్థానంలో బిన్నీని ఎన్నుకునేందుకు పెద్దలందరూ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ నెల 18న బీసీసీఐ అధ్యక్ష పదవితోపాటు కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, ట్రెజరరీ వంటి కీలక పదవులకు సైతం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు.. ఈ నెల 11, 12న నామినేషన్లు స్పమర్పించున్నారు. కాగా.. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వారివారి పదవుల్లో రెండో దఫా కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సౌరవ్ గంగూలీ కూడా రెండో దఫా తన పదవిలో కొనసాగుతారనే వార్తలు గతంలో వచ్చినా.. అనూహ్యంగా రోజర్ బిన్నీ పేరు తెరపైకి రావడం.. ఆయనే తదుపరి అధ్యక్షుడిగా అందరూ అంగీకరించడంపై సర్వత్రా అనుమానాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నా.. మరో వైపు గంగూలీ విషయంలో ఒక ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. సౌరవ్ గంగూలీని కన్నడ క్రికెటర్లు వెంటాడుతున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
గంగూలీ ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతని ఖాతాలో ఐసీసీ ట్రోఫీలు లేకున్నా.. ఇండియన్ క్రికెట్ దశా దిశను మార్చిన నాయకుడిగా దాదాకు పేరుంది. అలాంటి ఆటగాడు కోచ్‌తో విభేదాలు, బోర్డు రాజకీయాల వల్ల తన కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. 2005-06 మధ్య గంగూలీ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయాడు. అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు కూడా బోర్డులో రాజకీయాల నేపథ్యంలో దాదా బీసీసీఐ అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టలేకపోతున్నాడు. అతని స్థానంలో రోజర్ బిన్నీ అధ్యక్షుడు అవ్వడం ఖాయమైంది. కాగా.. గంగూలీ రెండో ముఖ్యమైన స్థానాలను కోల్పోయినప్పుడు అతని స్థానంలో వచ్చిన ద్రవిడ్, బిన్నీ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే. దీంతో ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావిస్తూ.. నెటిజన్లు ఈ విధంగా పేర్కొంటున్నారు. కాగా.. ఈ రెండో విషయాల్లోనూ ద్రవిడ్, బిన్నీకి ఎలాంటి పాత్ర లేదు. కేవలం కొందరి స్వార్థాల కోసం గంగూలీని తప్పించి వారిని నియమించినట్లు దాదా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
In 2005, Ganguly was removed as an Indian captain, then Rahul Dravid from Karnataka replaced him.
In 2022, Ganguly was removed as BCCI President, then Roger Binny from Karnataka replaced him.
— Johns. (@CricCrazyJohns) October 11, 2022