కరాచీ వేదికగా జరిగిన పాకిస్థాన్- న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. పాక్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఛేదిస్తుందనంగా అంపైర్లు కలుగజేసుకొని డ్రాగా ప్రకటించారు. చివరి రోజు ఆఖరి సెషన్ లో 50 నిమిషాలు సమయం ఉందనంగా పాక్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు, అభిమానులకు ముచ్చెమటలు పట్టించారు. అదే సమయంలో పాకిస్తానీ అంపైర్ అలీం ధార్ ఎంటరై.. బ్యాడ్ లైట్ కారణంగా చూపుతూ మ్యాచ్ ను డ్రాగా ప్రకటించాడు. ఈ డ్రామాకు కారణం.. పాక్ సారధి బాబర్ ఆజాం తీసుకున్న తల తిక్క నిర్ణయమే.
77-2 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ మరో 50 నిమిషాల్లో ఆట ముగుస్తుందనంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ 96 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, సర్ఫరాజ్ అహ్మద్ 53, సౌద్ షకీల్ 55(నాటౌట్) పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోది 6 వికెట్లు తీయగా, మిచెల్ బ్రేసెవెల్ 2 వికెట్లు పడగొట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే.. మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం. అలాంటి సమయంలో పాక్ సారధి బాబర్ ఆజాం తల తిక్క నిర్ణయం తీసుకున్నాడు. 15 ఓవర్లలో కివీస్ బ్యాటర్లను ఆలౌట్ చేయగలం అన్నట్లుగా.. వెనక్కొచ్చేయండి అంటూ క్రీజులో ఉన్న పాక్ బ్యాట్లర్లను ఆదేశించాడు. కివీస్ విజయం సాధించాలంటే.. 90 బంతుల్లో 138 పరుగులు చేయాలి.
Players shake hands as bad light forces a draw in Karachi. #PAKvNZ | #WTC23 | 📝 https://t.co/StkZ2iZmyz pic.twitter.com/9BNTduhejG
— Ritesh Ghimire (@reeteshjee) December 30, 2022
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆట ఆరంభించిన న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు, అభిమానులకు ముచ్చెమటలు పట్టించారు. 7.3 ఓవర్లలో స్కోర్ 60 పరుగులు దాటింది. విజయానికి మరో 45 బంతుల్లో 77 పరుగులు చేయాలి. డెవాన్ కాన్వే 16 బంతుల్లో 18 పరుగులు(2 ఫోర్లు), టామ్ లాథం 24 బంతుల్లో 35 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నారు. వీరు ఆడుతున్న తీరు చూస్తుంటే.. మ్యాచ్ ఫలితం వచ్చేలానే కనిపించింది. కానీ, అంపైర్లు అడ్డుపడ్డారు. బ్యాడ్ లైట్ కారణంగా చూపుతూ మ్యాచును డ్రాగా ప్రకటించారు. ఏదో అంపైర్ల పుణ్యమా అని గట్టెక్కింది కానీ, పూర్తి ఓవర్లు జరిగుంటే.. ఘోర పరాభవం తప్పకపోయేది.
Aleem Dar recusing Pakistan 😂
O home Test wins in this year…#PakvsNZ | #PAKvNZ | #NZvPAK | #NZvsPAK | #WTC23 pic.twitter.com/6kWChKabTC— Roger Minhas 👑 (@RogerEmmanuel7) December 30, 2022
అంతకుముందు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 612 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్ బాబర్ ఆజాం తీసుకున్న తల తిక్క నిర్ణయంపై(బ్రేవ్) నెట్టింట చటాకులు పేలుతున్నాయి. బాబర్ ఆజాం అంత తెలివైన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరంటూ సొంత దేశ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్ స్వదేశంలో ఈ ఏడాది ఒక్క విజయం కూడా లేకుండా ముగించడం గమనార్హం. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A Forgettable Year for Pakistani Fans#PAKvNZ pic.twitter.com/QZydQymnWZ
— RVCJ Media (@RVCJ_FB) December 30, 2022