టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు కారులో ప్రయణిస్తూ.. ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. అలాగే బీసీసీఐ సైతం పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ.. మీడియాకు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది. అయితే రిషభ్ పంత్ ఇంత తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురికావడంపై క్రీడాలోకం ఉలిక్కిపడింది. ప్రముఖ క్రికెటర్లంతా పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రిషభ్ పంత్‌కు జరిగిన ప్రమాదం ఒక గుణపాఠమని.. ఇలాంటి దుర్ఘటన మరే ఆటగాడికి కూడా జరగకూదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కపిల్ దేవ్ మాట్లాడుతూ..‘కీలక ఆటగాళ్లు సొంతంగా డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది. నేను వయసులో ఉన్న సమయంలోనూ నాకు కూడా బైక్ యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నా సోదరుడు నన్ను బైక్ డ్రైవ్ చేయనివ్వడు. అలాగే టీమ్‌లో కీలక ఆటగాళ్లు లాంగ్ డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్‌ను పెట్టుకోవాలి. డ్రైవింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. అది నేను అర్థం చేసుకోగలను కానీ.. మీపై ఉన్న బాధ్యతలను సైతం మర్చిపోకూడదు. రిషబ్ పంత్‌కు జరిగింది మరెవరికీ జరుగకూడదు. పంత్‌ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు భగవంతునికి ధన్యవాదాలు. ఈ ఘటన ఓ గుణపాఠం.’ అని కపిల్ పేర్కొన్నారు.
అయితే.. ఢిల్లీ నుంచి తన తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ జరుపుకోవాలని అర్ధరాత్రి ఢిల్లీ నుంచి రూర్కీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో బయలుదేరిన పంత్.. దురృష్టవశాత్తు నిద్రమత్తులో డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీంతో కారులో మంటలు వ్యాపించాయి. మంటలు కారు మొత్తం పూర్తిగా వ్యాపించక ముందే పంత్ కారు అద్దాలు బద్దలు కొట్టి ఎలాగోలా బయటపడ్డాడు. పంత్‌కారులోనే చిక్కుకుని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత స్థానికులు, ఇతర వాహనదారులు, లోకల్ పోలీసులు పంత్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరి పంత్ ప్రమాదంపై కపిల్ దేవ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలన కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This video is told to be of Rishabh Pant’s recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022