కొత్త జట్లు, రిటెన్షన్, మెగా ఆక‌్షన్.. ఇలా అన్ని దశలు దాటుకుని ఐపీఎల్ 2022 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇటివల బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిన మెగా వేలం తర్వాత ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో తేలిపోయింది. ఇక ఆ తర్వాత జట్టు బలాబలాలపై అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఆ జట్టు అభిమానులే వెదవివిరుస్తున్నారు. ఆటగాళ్ల కూర్పు సరిగాలేదని అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌లోని ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారని, బలమైన జట్టును సమకూర్చుకోలేకపోయారని సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మేనేజ్‌మెంట్ ఒంటెద్దుపోకడ..
ఐపీఎల్ మెగా వేలంలో SRH మేనేజ్‌మెంట్ అంతా తానై వ్యవహరించిందనే విమర్శ వినిపిస్తుంది. జట్టులో ఏ ఆటగాళ్ల అవసరం ఉందో అంచనా లేకుండా.. సరైన ఆటగాళ్లను పిక్ చేసుకోలేదని SRH ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. పూరన్, షెపర్డ్‌పై అంతా భారీ ధర పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ఇప్పటికే రిటైన్ చేసుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ సలహాలను తీసుకుంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తనకు ఎలాంటి జట్టు కావాలో విలియమ్సన్‌కు ఒక అవగాహన ఉంటుందని దాని ప్రకారం జట్టును ఏర్పాటు చేసుకుంటే బాగుండేదని అంటున్నారు. జట్టుకు ఓపెనర్లు లేకపోవడం మేనేజ్‌మెంట్ చేసిన అతిపెద్ద తప్పిందంగా SRH ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వార్నర్‌కు పట్టిన గతే కేన్‌కు..
గతంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ SRH కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా SRH మేనేజ్‌మెంట్ ఇలానే వేలంలో కెప్టెన్ ప్రమేయం లేకుండా సొంత ప్రయోగాలు చేసేది. దీంతో సరైన జట్టులేక కెప్టెన్‌గా వార్నర్ ఇబ్బంది పడేవాడు. ఉన్న జట్టుతోనే నెట్టుకోచ్చాడు. కానీ SRH మేనేజ్‌మెంట్ తమ తప్పును తెలుసుకోకుండా.. వార్నర్ కెప్టెన్‌గా, ఆటగాడిగా తప్పించిందని SRH ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేన్ విలియమ్సన్‌కు కూడా ఇలాంటి అవమానమే ఎదురుకానుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కేన్ మామ కూడా జట్టు ప్రదర్శనను తన ఫెల్యూయిర్‌గా మేనేజ్‌మెంట్ ప్రొజెక్ట్ చేస్తుందని వారి వాదన. వాస్తవంగా చూస్తే.. నిజంగానే జట్టు అంత సమతుల్యంగా లేదు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా స్పందిస్తూ.. కేన్ విలియమ్సన్ బకరా అవుతాడని అభిప్రాయపడ్డాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.