సాధారణంగా గ్రౌండ్ లో అభిమానులు రావడం చూస్తూ ఉంటాము. గతంలో ఇలా మేచ్ మధ్యలో వచ్చి తమ ఫేవరేట్ క్రికెటర్ ని కలిసి వెంటనే వెళ్ళిపోతారు. అయితే యాషెస్ లో మాత్రం కొంతమంది ఎవరి పర్మిషన్ లేకుండా మ్యాచ్ మధ్యలో వచ్చి అంతరాయం కలిగించారు. ఈ సమయంలో బెయిర్ స్టో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
2023 యాషెస్ లో భాగంగా రెండో టెస్టు నేడు లార్డ్స్ లో ప్రారంభమైంది. మొదటి టెస్టులో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ ఈ టెస్టులో గెలిచి పట్టు బిగించాలని చూస్తుంది. ఇక మరో వైపు ఇంగ్లాండ్ ఈ టెస్టులో ఎలాగైనా ఆధిక్యాన్ని సమం చేయాలని చూస్తుంది. ఎప్పటిలాగే వేల మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ మ్యాచులో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి వచ్చింది. అయితే ఈ సమయంలో కొంతమంది డైరెక్ట్ గా పిచ్ మీదకు దూసుకొచ్చారు. ఈ సమయంలో బెయిర్ స్టో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ పిచ్ మీదకి ఎవరు వచ్చారు బెయిర్ స్టో ఎం చేసాడో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా గ్రౌండ్ లో అభిమానులు రావడం చూస్తూ ఉంటాము. గతంలో ఇలా మేచ్ మధ్యలో వచ్చి తమ ఫేవరేట్ క్రికెటర్ ని కలిసి వెంటనే వెళ్ళిపోతారు. అయితే యాషెస్ లో మాత్రం కొంతమంది ఉద్యమకారులు ఎవరి పర్మిషన్ లేకుండా మ్యాచ్ మధ్యలో వచ్చి మ్యాచ్ కి అంతరాయం కలిగించారు. వారెవరో కాదు ఇంగ్లాండ్ లోని ఆయిల్ ఉద్యమ కారులు. ఇటీవల కాలంలో వీరు ఇంగ్లాండ్ లో ఎక్కడ మ్యాచ్ జరిగిన ఇలా చేయడం ఒక అలవాటుగా మారింది. ఇంగ్లాండ్ లో ఆయిల్ టర్మినల్స్ ని కాపాడాలంటూ.. జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిటీ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఇక యాషెస్ లో వీరు స్టేడియంలో నాలుగు వైపులా నుంచి సడన్ గా పిచ్ మీదకు దూసుకొని వచ్చి అందరికీ షాకిచ్చారు. ఈ సమయంలో కాసేపు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.
అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న బెయిర్ స్టో..తనపై దూసుకొస్తున్న ఆందోళన కారుడిని ఎత్తి బౌండరీ వైపుగా పడేసాడు. మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు. కానీ మ్యాచ్ మధ్యలో ఇలా అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదు అని వారికి చెప్పాడు. బెయిర్ స్టో చేసిన ఈ పనికి అందరూ షాక్ తిన్నప్పటికీ అభిమానులతో పాటు ప్లేయర్లు కూడా అతన్ని అభినందించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తనికి ఆందోళనకారులు ఇలా గ్రౌండ్ మీదకు దూసుకువచ్చి ఊహించని షాకిస్తే.. బెయిర్ స్టో చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.
Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023