'ఆసియ కప్ 2023' టోర్నీ ఉనికి ప్రశార్థకంగా మారింది. పాక్‌లో అడుగుపెట్టేందుకు ఇండియా, టోర్నీని వేరే దేశానికి తరలించేందుకు పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఆసియా కప్ 2023 టోర్నీ జరగడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టును, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ క్రికెటర్ జునైద్ ఖాన్ కించపరిచేలా మాట్లాడాడు.
‘భారత్ – పాకిస్తాన్..‘ ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతున్నాయంటే అభిమానులకు అంతకుమించిన అందం మరొకటి ఉండదు. బంతి బంతికి విజయం చేతులు మారుతున్న క్షణాలు, ఇరుదేశాల అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తుంటాయి. మా జట్టు గెలవాలంటే.. మా జట్టే గెలవాలని.. ఇరుదేశాల ప్రజలు పూజలు చేస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచులు జరగడం లేదు. ఒక్క ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. సరిహద్దు వివాదాలు, రాజకీయ కారణాలే అందుకు ప్రధాన కారణం. టెర్రిస్టులకు పాక్ ఆశ్రయం కల్పిస్తుండడం కూడా అందుకు ఒక కారణమే. ఈ క్రమంలో ఆసియ కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
వాస్తవానికి ‘ఆసియా కప్ 2023‘ టోర్నీ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా భారత్.. పాక్ లో పర్యటించడం కుదరదని బీసీసీఐ సెక్రెటరీ జైషా తేల్చి చెప్పిన సంగతి అందరికీ విదితమే. భారత జట్టు పాక్ లో పర్యటించదని, ప్రత్యామ్నాయ వేదికలు చూడాలని కోరాడు. అందుకు అంగీకరించని పాక్, అదే జరిగితే త్వరలో భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఆనాటి నుంచి ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య వైరం మరింత పెరిగింది. దీనికితోడు శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా పాక్ పర్యటనకు అభ్యంతరం చెప్పడంతో టోర్నీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి పరిష్కారం చూపేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ జునైద్ ఖాన్ భారత్ జట్టును, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడాడు.
Asia Cup 2023 current situation be like pic.twitter.com/gq0OAVRgm7
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 23, 2023
ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయన్నా జునైద్ ఖాన్, ఎవరికి లేని ప్రాబ్లమ్స్ భారత ఆటగాళ్లకు ఎందుకొస్తున్నాయి. వారేమైనా మరో గ్రాహం నుంచి ఊడిపడ్డారా..? అంటూ నోటికొచ్చినట్లు వాగాడు. “ఇతర దేశాల వలే పాకిస్తాన్ సురక్షితమైన దేశం. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇక్కడ పర్యటించాయి. వారికి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాలేదు. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు ఎందుకొస్తున్నాయి. వాళ్లేమైనా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా..? చెప్పండి ఏలియెన్స్ హా..?. ఇప్పటికైనా ఐసీసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పాక్ చిన్న జట్టు కాదు. పాకిస్తాన్ లేకుండా ఐసీసీ టోర్నీలు, క్రికెట్ జరపడం అసాధ్యం..” అంటూ కామెంట్ చేశాడు. జునైద్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇరుదేశాల అభిమానుల ఒకరిపై మరొకరు తిట్లదండకం మొదలుపెట్టారు. పాకిస్తాన్ లేకుండా క్రికెట్ జరపడం అసాధ్యమా.? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Junaid Khan lashes out at BCCI for not agreeing to travel Pakistan for the Asia Cup.#JunaidKhan #BCCI #INDvsPAK pic.twitter.com/g0GufsaDXl
— CricTracker (@Cricketracker) May 11, 2023