పరుగులు చేయాలనే తపన, కష్టపడే తత్వం, పట్టుదల, ఎక్కడా తగ్గకూడదనే ఆటిట్యూడ్ కోహ్లీని అందరి వాడిని చేసింది. ఈ క్రమంలో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న కోహ్లీకి.. ఒక మహిళ అభిమానిగా మారిపోయి ఏకంగా కోహ్లీని కలవడానికి వచ్చింది.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని అస్సలు తగ్గడం లేదు. దేశంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన కోహ్లీ.. క్రికెట్ లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసాడు. ఫిట్ నెస్, రికార్డ్స్, యాటిట్యూడ్ ఎలా చూసుకున్నా తనకు తానే సాటి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోహ్లీ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక మాజీలు సైతం కోహ్లీ ఆటకు ఫిదా అయిపోయి అతనికి అభిమానిగా మారుతుంటారు. పరుగులు చేయాలనే తపన, కష్టపడే తత్వం, పట్టుదల, ఎక్కడా తగ్గకూడదనే ఆటిట్యూడ్ కోహ్లీని అందరి వాడిని చేసింది. అయితే ప్రస్తుతం ఒక పెద్ద మహిళ కోహ్లీకి అభిమానిగా మారిపోయి ఏకంగా కోహ్లీని కలవడానికి వచ్చింది. ఇంతకీ ఆ మహిళ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం కోహ్లీ వెస్టిండీస్ పర్యటనలో సిరీస్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 20 న ప్రారంభమైన రెండో టెస్టులో కోహ్లీ సెంచరీ కొట్టేసాడు. అంతర్జాతీయ కెరీర్ లో 500 వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్ ని చాలా స్పెషల్ గా మార్చుకున్నాడు. ఇక ఈ ఆనందంలో ఉన్న కోహ్లీకి వెస్టిండీస్ వికెట్ కీపర్ డిసిల్వా అమ్మ రాక మరింత ఆనందాన్ని ఇచ్చింది. కేవలం కోహ్లీ కోసమే స్వయంగా ఇలా రావడం నిజంగా కోహ్లీకి దక్కిన పెద్ద ఘనత. కోహ్లీని ఆనందంతో హద్దుకుంటూ ముద్దు పెట్టుకుంది. ఈ సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన కోహ్లీ అభిమానునులు పండగ చేసుకుంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులకి ఆలౌటైంది. తొలి రోజు రోహిత్ (80) జైస్వాల్ (57) హాఫ్ సెంచరీలతో ఇచ్చిన భాగస్వామ్యంతో కోహ్లీ(121), జడేజా(61) జట్టుని భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. చివర్లో అశ్విన్ తనకిష్టమైన ప్రత్యర్థి విండీస్ జట్టుపై హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ జట్టు నిలకడగా ఆడుతుంది. ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ బ్రాత్ వైట్ (37) మెకంజీ(14) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 352 పరుగులు వెనకపడి ఉంది. మొత్తానికి 500 వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీకి డిసిల్వ అమ్మగారు కలవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.