క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆటగాళ్లు.. కొంత కాలం తర్వాత తమ ఆటకు వీడ్కోలు పలకడం సాధారణ విషయమే. ఇక తమ రిటైర్మెంట్ పోస్ట్ లో భావొద్వేగపూరితమైన మాటలను పంచుకుంటుంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తమ కెరీర్ కు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అయితే ఈ రిటైర్మెంట్ కాపీని ఆటగాళ్లు సొంతగా రాసుకుంటారు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఓ టీమిండియా క్రికెటర్ వీడ్కోలు కాపీ.. మరో ఆటగాడి రిటైర్మెంట్ కాపీని మక్కీకి మక్కీ ఉందన్న వార్త తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది.
మురళీ విజయ్.. కొన్ని రోజుల క్రితమే క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అందుకు సంబంధించి ఓ స్టేట్ మెంట్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అలాంటి సేమ్ టూ సేమ్ రిటైర్మెంట్ స్టేట్ మెంట్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ మక్కీకి మక్కి దింపేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వారం రోజుల వ్యవధిలోనే టీమిండియా స్టార్ ఓపెనర్ మురళి విజయ్, ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మలు తమ రిటైర్మెంట్ ప్రకటించారు. తొలుత విజయ్ తన వీడ్కోలు కాపీని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ తర్వాత తాను కూడా వీడ్కోలు ప్రటిస్తున్నానని ట్వీటర్ ద్వారా తెలిపాడు భారత బౌలర్ జోగిందర్ శర్మ.
అయితే వీరిద్దరి రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ కాపీ దాదాపు సేమ్ టూ సేమ్. కేవలం వారి పేర్లు, కెరీర్ తేదీలు, తాము ప్రాతినిథ్యం వహించిన రాష్ట్ర క్రికెట్ సంఘం పేర్లను మాత్రమే మార్చాడు అంట జోగిందర్ శర్మ. జోగిందర్ శర్మ, మురళీ విజయ్ రిటైర్మెంట్ మెంట్ కాపీని కాపీ కొట్టాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే మురళి విజయ్, జోగిందర్ శర్మలు భారత జట్టుకు కలిసి కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ IPLలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కు ఇద్దరు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇద్దరి వీడ్కోలు కాపీలు ఒకే తీరుగా ఉండటంతో నెట్టింట ఫన్నీ జోకులు పేలుతున్నాయి. కనీసం లైన్స్ కూడా మార్చలేదని ట్రోల్స్ చేస్తున్నారు సగటు క్రికెట్ అభిమానులు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Isne poora murali Vijay ka retirement speech chaap liya 🤣 word to word 😂 https://t.co/I84DsA4EAd pic.twitter.com/NDfneYitaF
— Dr Nimo Yadav (@niiravmodi) February 3, 2023
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023