ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమమైన ఆటగాళ్లలో ఒకడు. మైదనాంలో ఎంతటి కొమ్ములు తిరిగిన బౌలర్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కానీ.. ఒక యంగ్ లేడీ వేసిన ఇన్‌స్వింగ్‌కు మాత్రం జో రూట్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆమె బౌలింగ్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. ఈ మేటి క్రికెటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆ యువతి మరెవరో కాదు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ గారాలపట్టి. ఆమెను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు స్వయంగా కాలింగ్‌వుడ్ ఆమెకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ప్రాక్టీస్‌లో భాగంగా జో రూట్‌కు బౌలింగ్ చేసిన కాలింగ్‌వుడ్ కుమార్తె.. తన అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో రూట్‌ను బొల్తా కొట్టించింది. ఆమె రూట్‌ను అవుట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇంత అందమైన క్రికెటర్‌ను తాము చూడలేదంటూ నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెస్తున్నారు. అలాగే ఆమె అద్భుతంగా బౌలింగ్ చేస్తుందంటూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉండి సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న రూట్‌ను ఇలా క్లీన్ బౌల్డ్ చేయడంతో క్రికెట్ అభిమానులు సైతం కాలింగ్‌వుడ్ కూతుర్ని ప్రశంసిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించి మంచి ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రూట్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో దుమ్మురేపుతున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు. మరీ ఇలాంటి ప్లేయర్‌ను కాలింగ్‌వుడ్ కూతురు క్లీన్‌బౌల్డ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.