ఇటివల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ గ్రౌండ్‌లో చేత్తో పట్టుకోకుండా బ్యాట్‌ను నిలబెట్టడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బౌలర్ రన్నప్ తీసుకుంటున్న సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రూట్ తన బ్యాట్‌ను కొన్ని క్షణాల పాటు గ్రౌండ్‌పై నిటారుగా నిల్చోబెట్టాడు. రూట్ చేసిన మ్యాజిక్‌కు సోషల్ మీడియాలో ఫిదా అయిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఇప్పుడు మేజిషియన్‌గా కూడా మారిపోయాడా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు కూడా చేశారు. రూట్ చేసిన మ్యాజిక్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా రిపీట్ చేద్దామనుకున్నాడు. కానీ అది సక్సెస్ కాలేదు. రూట్ నిలబెట్టినట్లు కోహ్లీ బ్యాట్‌ను నిలబెట్టలేకపోయాడు.
ఈ ఘటనను క్రికెట్ అభిమానులు మరువక ముందే మరో బ్యాట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బ్యాటింగ్‌కు వెళ్లి అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు కోపంగా వచ్చిన జో రూట్ తన బ్యాట్‌ను నేలకేసి కొడితే బ్యాట్ ఎగిరి సీలింగ్‌కు అతుక్కుంటుంది. గ్రౌండ్‌లో బ్యాట్‌ను నిలబెట్టిన రూట్.. డ్రెస్సింగ్ రూమ్ ఇలా నిలబెట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా అది జో రూట్ బ్యాట్ కాదని ఎవరో అభిమానులు చేసిన వీడియో అంటూ మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ‘‘రూట్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని తెలుసు. కానీ ఇలా మ్యాజిక్ చేస్తాడని తెలియదు. ఇదేదో చేతబడిలా ఉంది’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.