Javed Miandad, IND vs PAK: చావు బతుకులు అల్లా చేతుల్లో ఉంటాయి. భారత్ ఈ రోజు మమ్మల్ని పిలిచినా మేం వెళ్తాం. కానీ వాళ్లు కూడా రావాల్సి ఉంటుంది. చివరగా మేం వెళ్లాం. కానీ వాళ్లు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు వాళ్ల వంతు..
క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. అదో మినీ యుద్ధం. కానీ.. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు లేని కారణంగా.. చాలా కాలంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్లలో మాత్రమే ఈ దాయాదుల మధ్య పోరు జరుగుతోంది. ఆసియా కప్, టీ20, వన్డే వరల్డ్ కప్స్‌లో మాత్రం భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం దక్కుతోంది. చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని కోరుకుంటున్నప్పటికీ ఆ పరిస్థితుల లేవు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2023 వచ్చింది. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతుండటంతో భారత్ పాల్గొంటుందా? లేదా? అనే విషయంపై చాలా కాలంగా చర్చ జరిగింది.
అయితే.. పాకిస్థాన్‌కు భారత జట్టును పంపించే ప్రసక్తే లేదని, అవసరమైతే తటస్థ వేదికలో టోర్నీ జరిగేలా చూస్తామని ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ స్పష్టం చేసింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత జట్టు పాకిస్థాన్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు.. ఒక వేళ రాకుంటే తాము కూడా భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023కు రామని బ్లాక్‌మెయిల్‌కు సైతం దిగింది. అయినా కూడా బీసీసీఐ మెట్టు దిగకపోవడంతో.. పాక్ బోర్డు అయిష్టంగానే సర్దుకుపోతుంది. పాకిస్థాన్‌లోనే ఆసియా కప్ 2023 జరుగుతుంది, కానీ.. భారత్ మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయని ఏసీసీ ప్రకటించింది. దీంతో ఆసియా కప్‌పై చర్చ ముగిసింది.
ఈ క్రమంలో పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ జావిద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘భద్రత గురించి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే మరణం రాసిపెట్టి ఉంటే, వస్తుంది. చావు బతుకులు అల్లా చేతుల్లో ఉంటాయి. భారత్ ఈ రోజు మమ్మల్ని పిలిచినా మేం వెళ్తాం. కానీ వాళ్లు కూడా రావాల్సి ఉంటుంది. చివరగా మేం వెళ్లాం. కానీ వాళ్లు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు వాళ్ల వంతు’ అని పేర్కొన్నాడు. ఆసియా కప్ కోసం పాకిస్థాన్ వెళ్లకపోవడంపై భారత్ కారణం చెబుతూ.. ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మియాందాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆటగాళ్లు చావుకు భయపడుతున్నారంటూ మియాందాద్ పరోక్షంగా ఎద్దేవా చేశారని, పాకిస్థాన్‌లో ఎప్పుడు బాంబులు పడతాయో అక్కడి వారికే తెలివని, అలాంటి దేశానికి తమ క్రికెటర్లను ఎలా పంపాలని భారత క్రికెట్ అభిమానులు మియాందాద్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Agar Maut Aani Hai..’: Javed Miandad’s Shocking Remarks On IND vs PAK Asia Cup Controversy@Javed__Miandad #IndiavsPakistan #IndVsPak #AsiaCup2023 #ODIWorldCup2023 #Javedmiandad https://t.co/AWul2d7iTg
— CricketCountry (@cricket_country) April 12, 2023