బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టుసాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 284 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ 132 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేసి.. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానిస్తే భారత్ ఈ మ్యాచ్‌ను గెలిచే అవకాశం ఉంది.
కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. స్టువర్ట్ బ్రాడ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు పిండుకుని ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఇన్నాళ్లు బౌలింగ్‌లో సత్తా చాటిన బుమ్రా.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ప్రొఫెషనల్ బ్యాటర్‌ను తలపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ప్రొఫెషనల్ బ్యాటర్‌గా చెలరేగిన బుమ్రాను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
తాజాగా ఇదే విషయంపై బుమ్రా సతీమణి స్పందించారు. తానే బుమ్రాకు బ్యాటింగ్ నేర్పానని సరదాగా చెప్పుకొచ్చారు. బౌలింగ్ విషయాన్ని ప్రస్తావించగా.. దాని గురించి తనకు తెలియదని, కేవలం తాను బ్యాటింగ్ నేర్పించడంపైనే ఫోకస్ పెట్టానని పేర్కొన్నారు. ‘నేను బుమ్రా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టా. అందులో నేను సక్సెస్ సాధించా. బుమ్రా కొట్టిన పరుగులన్నీ కూడా నావే’ అంటూ సంజనా మురిసిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanjana Ganesan reveals Jasprit Bumrah and his family’s reaction following his 🇮🇳 captaincy announcement.
Read more 👉 https://t.co/JF76BAjcUE pic.twitter.com/GZNDV6o51J
— ICC (@ICC) July 1, 2022