సంజనా గణేశన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మోడల్, స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సంజనా. గతంలో పలు క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లకు హోస్ట్‌గా చేసినా.. 2019 వన్డే ప్రపంచకప్ ద్వారానే ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 2019 ప్రపంచకప్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా నిలదొక్కుకున్నారు. ఇక.. గతేడాది టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లిచేసుకొని ఒక్కసారిగా సెలెబ్రెటీగా మారిపోయారు. ఇప్పుడు ఈమె గురుంచి మనకెందుకంటారా? ఈమె చేసిన రచ్చ మామూలుది కాదు. ఈమె చేసిన పని వల్ల ‘బుమ్రా’ ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. అంతలా ఏం చేసింది అనేగా? మీ ప్రశ్న. అయితే.. చదవాల్సిందే.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల మధ్య ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. కోహ్లీ నిలకడగా ఎప్పటినుంచో రాణిస్తున్నా.. రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ అయినప్పటి నుండి కెరీర్ ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేం. ఎందుకంటే.. వారిద్దరి పాత్రలు వేరు. కొత్త బంతి బౌలర్ల బౌలింగ్‌లో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటం రోహిత్ పాత్ర. మరోవైపు మ్యాచ్ ఆసాంతం నిలబడి మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడమే కోహ్లీ పాత్ర. ఇలా.. ఇద్దరి ఆటతీరు వేరు వేరు. ఈ విషయంపై వీరిద్దరూ నోరు మెదపనప్పటికీ.. పలువురు మేధావులు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. నెటిజన్స్ నోటికి పని చెప్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి బుమ్రా భార్య సంజనా గణేషన్ చేరింది.
Sanjana Ganesan liked post saying Virat Kohli is better than Rohit Sharma pic.twitter.com/dqRHTacutI
— Behind Cricket (@behindCric8) June 1, 2022
క్రికెటర్లతో పాటు వారి వారి భార్యల మీద కూడా నెటిజన్స్ ఓ కన్నేసి ఉంచుతారు అనడానికి ఇదో మంచి ఉదాహరణ. “రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ బెటర్” అని యూజర్ ట్వీట్ చేయగా.. దానికి సంజనా ఒక లైక్ కొట్టింది. ఇంతటితో అయిపోయిందా? అంటే లేదు.. దీన్ని ఒక యూజర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వివాదాస్పందగా మారుతోంది. సోషల్ మీడియాలో.. రోహిత్ ఫ్యాన్స్ సంజనా గణేశన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “ఏం చూసి లైక్ కొట్టావని” కొందరు.. “మీ ఆయన ముంబైకు ఆడుతుంటే.. నువ్ ఆర్సీబీ ప్లేయర్ ని సమర్థిస్తావా” అంటూ మరికొందరు ఆమెపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఈ విషయంపై సంజనా గణేశన్ వివరణ ఇస్తుందో లేదో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Deepak Chahar: ఘనంగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వివాహం.. ఫొటోస్ వైరల్!