టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కెప్టెన్‌గా టీమిండియాను విజయపథంలో నడిపించాడు. అలాంటి ఆటగాడు 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమైతే.. అది మరింత గొప్పగా, గుర్తుండిపోయేలా ఉండాలి. అందుకే టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ఆటగాళ్లు ఎలాగైన శ్రీలంకతో జరిగే తొలిటెస్టును గెలవాలని దృఢసంకల్పంతో ఉన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడమే తాము అతనికిచ్చే గొప్ప బహుమతి అని అన్నాడు. కోహ్లీకి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావానికి అతని వందో టెస్టు మ్యాచే నిదర్శనమని చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 100 మ్యాచ్‌లు ఆడడమనేది ఎవరికైనా ప్రత్యేకమైనదేనని బుమ్రా అన్నాడు. ఇది కోహ్లీ హార్డ్ వర్కను తెలియచేస్తుందని చెప్పాడు. టీమిండియా విజయాల కోసం విరాట్ కోహ్లీ ఎన్నో త్యాగాలు చేశాడని, భవిష్యత్‌లోనూ ఇలాగే రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని బుమ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇక ఇప్పటివకే ఎన్నో రికార్డులను సాధించిన విరాట్ కోహ్లీ ఖాతాలో వందో టెస్టు మ్యాచ్ అనేది మరో ఘనత అని బుమ్రా చెప్పాడు. ఒక క్రికెటర్‌గా తన వందో టెస్టులో కోహ్లీ అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం తామంతా ఆటపైనే దృష్టి పెట్టామని, పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగుతామని బుమ్రా చెప్పాడు. కాగా తన కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 50 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా వందో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రేక్షకులను బీసీసీఐ స్టేడియంలోకి అనుమతించింది. స్టేడియం కెపాసిటీలో 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవికరించింది. ఇలా అన్ని అంశంలు కోహ్లీ వందవ టెస్టు కోసం సానుకూలంగా మారుతున్నాయి. మరి విరాట్ కోహ్లీ 100వ టెస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.