జస్ప్రిత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు రీసౌండ్ అవుతోంది. ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన వన్డేలో భారత్ జట్టు ఇంగ్లాండ్ ని చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి వన్డేలో బుమ్రా కేవలం 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అటు ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ వికెట్ పడకుండా టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రదర్శనతో జస్ప్రిత్ బుమ్రా మళ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
బుమ్రా మొత్తం 730 రోజులు వరల్డ్ నంబర్ 1 స్థానంలో కొనసాగాడు. ఇప్పటివరకు ఆ రికార్డు మరే టీమిండియా బౌలర్ కు సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వల్ల బుమ్రా నంబర్ స్థానాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి బుమ్రా నంబర్ 1 స్థానం కోసం ఇన్నాళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా ఓవల్ లో చేసిన ప్రదర్శనతో బుమ్రా తిరిగి వన్డే ర్యాకింగ్స్ లో నంబర్ 1 స్థానాన్ని పొందాడు.
Presenting the current No.1 Bowler in ICC Men’s ODI Rankings! 🔝
Well done, @Jaspritbumrah93! 👏👏#TeamIndia pic.twitter.com/S8qoohWOSD
— BCCI (@BCCI) July 13, 2022
గతంలో టీ20ల్లో నంబర్ 1 బౌలర్ గా కొనసాగిన బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో కెరీర్ అత్యుత్తమం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్ లో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో మొత్తం భూమ్ భూమ్ బుమ్రా పేరే వైరల్ అవుతోంది. వన్డేల్లో వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా మారిన బుమ్రాకు కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి.
Jasprit Bumrah is back at the top spot in the ICC men’s ODI rankings for bowlers 👏 pic.twitter.com/OcPQhcXOkm
— ESPNcricinfo (@ESPNcricinfo) July 13, 2022
Jasprit Bumrah 6-19 vs England Full Spell pic.twitter.com/p8f7hJgogO
— Balerion (@Manav_161) July 13, 2022