యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి విధ్వంసాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు కొట్టే బ్యాటర్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా క్రిస్ గేల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్రాంచైజ్ క్రికెట్‌లో గేల్ ఒక సునామీ.. కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిపిస్తే చాలు లీగ్ మొత్తం ఆడాల్సిన పనిలేదు అని గేల్‌ను కోట్లు పోసి కొనేందుకు సిద్ధపడేవి ఫ్రాంచైజ్‌లు. అలాంటి క్రిస్ గేల్ ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటాడు. సిక్సుల వర్షం కురిపించే గేల్.. నిలబడితే సెంచరీ బాదేసేవాడు.
పేసర్లను సైతం చాలా సులువుగా సిక్సులు బాదడం గేల్ స్టైల్. పెద్దగా కదలకుండా.. అక్కడ నిలబడి గేల్ సిక్సులు కొడుతుంటే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అప్పుడప్పుడు మెరుపులు మెరిపించేవాడు. అయితే.. ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌ను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఒకరున్నారంట. పైగా అతనో టీమిండియా స్టార్ బౌలర్. ఐపీఎల్‌లో అతని బౌలింగ్‌లో ఆడేందుకు చాలా ఇబ్బంది పడే వాడినని, ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతనే అంటూ క్రిస్ గేల్ కితాబిచ్చాడు. మరి గేల్‌ను ఇబ్బంది పెట్టిన ఆ భారత బౌలర్ ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు మన స్పీడ్‌స్టర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడే బుమ్రా.. ఐపీఎల్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. అలాగే ఐపీఎల్ ఆరంభంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడిన గేల్.. ఐపీఎల్ మొత్తం 6 సెంచరీలు బాదాడు. అతని ఖాతాలో ఏకంగా 357 సిక్సులతో పాటు 4967 పరుగులు ఉన్నాయి. ఇలా బౌలర్లపై వీరప్రతాపం చూపించే గేల్ మాత్రం.. బుమ్రా బౌలింగ్‌లో ఇబ్బంది పడే వాడు. ఇప్పుడు అదే విషయాన్ని గేల్ సైతం వెల్లడించాడు. అలాగే ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ స్టైలిష్ క్రికెటర్ అంటూ పేర్కొన్నాడు. మరి గేల్ స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.</p
Chris Gayle picks Jasprit Bumrah as the toughest bowler he faced in the IPL.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2023