టీమిండియా తరఫున ఆడితే గాయపడే బుమ్రా.. ఐపీఎల్‌కు మాత్రం సిద్ధంగా ఉంటాడంటూ అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతను ఐపీఎల్‌కు సైతం దూరం అవుతున్నట్లు సమాచారం. అయితే.. అందుకు కారణం ఏంటంటే..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా కాలంగా జట్టులో లేని విషయం తెలిసిందే. వెన్నునొప్పితో గతేడాది జట్టుకు దూరమైన బుమ్రా.. ఈ ఏడాది కాలంలో టీమిండియా తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు బుమ్రా లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. ఇక వీటి మధ్యలో జరిగిన చిన్నాచితక ద్వైపాక్షిక సిరీస్‌లకు కూడా బుమ్రా జట్టులో లేడు. మధ్యలో బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడని, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడంటూ వార్తలు వచ్చాయి. కానీ.. అది జరగలేదు.
అలాగే ఆస్ట్రేలియాతో చివరి రెండులతో పాటు మూడు వన్డేల సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇస్తాడంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రకటించడంతో బుమ్రా మళ్లీ మైదానంలో తిగుతున్నట్లు క్రికెట్ అభిమానులు సంతోషపడ్డారు. కానీ.. ఇటివల రెండు టెస్టులతో పాటు, వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా లేకపోవడంతో ఇక బుమ్రా డైరెక్ట్‌గా ఐపీఎల్‌లోనే ఆడతాడంటూ అంతా భావించారు. బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సైతం వీటికి బలం చేకూర్చాయి. దీంతో బుమ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వచ్చాయి. జాతీయ జట్టుకు ఆడితే గాయమంటూ తప్పుకునే బుమ్రా ఐపీఎల్ అనగానే రెడీ అయిపోతాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.
కాగా.. తాజా సమాచారం మేరకు.. బుమ్రా ఐపీఎల్‌కు సైతం దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, దీంతో ఐపీఎల్ 2023లో ఆడే అవకాశం లేదంటూ సమాచారం అందుతోంది. అయితే.. నిజంగానే బుమ్రా గాయం నుంచి కోలుకోలేదా? లేక తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక బుమ్రానే ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడనే అంటూ క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బుమ్రా పూర్తిగా కోలుకున్న తర్వాతే బరిలోకి దిగాలని, అతన్ని తొందరపెట్టాల్సిన అవసరం లేదంటూ బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వన్డే వరల్డ్ కప్ వరకు బుమ్రా కోలుకుంటే చాలాని బీసీసీఐ పెద్దలు చెప్పినట్లే తెలుస్తోంది. మరి బుమ్రా ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah pic.twitter.com/d4yoS4lM2f
— RVCJ Media (@RVCJ_FB) February 26, 2023